జూన్ 14 వరకు ఆధార్ కార్డు అప్‌డేట్ ఉచితం...
- March 26, 2023
న్యూ ఢిల్లీ: మీ ఆధార్ కార్డులో వివరాలను అప్‌డేట్ చేసుకున్నారా? భారతీయ పౌరులకు ఆధార్ కార్డ్ అనేది ఒక గుర్తింపు కార్డు.. ప్రతి నివాసికి ప్రత్యేకమైన 12-అంకెల గుర్తింపు సంఖ్య ఉంటుంది. ప్రస్తుతం ఆధార్ కలిగిన కార్డుదారులు ఎవరైనా తమ వివరాల్లో ఏదైనా తప్పులు ఉంటే మార్చుకునే అవకాశం ఉంది. రాబోయే 3 నెలల పాటు ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్‌డేట్ చేసుకునే వీలుంది.
ఈ మేరకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఇటీవల ప్రకటించింది. ఆన్‌లైన్‌లో ఆధార్ డాక్యుమెంట్లను అప్‌డేట్ చేసే ప్రక్రియ రూ.50 ఫిజికల్ ఆధార్ కేంద్రాలలో, వినియోగదారు జనాభా వివరాలను తిరిగి ధృవీకరించడానికి గుర్తింపు రుజువు (PoI), అడ్రస్ ప్రూఫ్, (PoA) డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఆధార్ కార్డ్ దశాబ్దం క్రితమే జారీ అయినట్టయితే వెంటనే మీ ఆధార్ కార్డు వివరాలను తప్పనిసరిగా అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
జనాభా వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకోవాలని UIDAI సూచిస్తోంది. జనాభా వివరాలను అప్‌డేట్ చేసే ప్రక్రియ తప్పనిసరి కాదు. ఆన్‌లైన్‌లో ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసుకోవడం అనేది సులభమైన ప్రక్రియ. ఇది కొన్ని నిమిషాల్లోనే పూర్తవుతుంది. అప్‌డేట్ చేయాల్సిన డెమోగ్రాఫిక్ డేటాను బట్టి యూజర్‌లకు ఒరిజినల్ PoI, PoA డాక్యుమెంట్‌ల స్కాన్ చేసిన కాపీలు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఆధార్ కార్డులో మార్పులు చేస్తున్నప్పుడు UIDAI ప్రకారం.. ఫిజికల్ సెంటర్లలో రూ. 50 చెల్లించాల్సి ఉంటుంది. అయితే, జూన్ 14 వరకు ఎలాంటి ఖర్చు లేకుండా ఆధార్ కార్డులో వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు. జూన్ 14లోపు మీ ఆధార్ కార్డ్ వివరాలను ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్‌డేట్ చేసుకోవాలంటే ఇలా ప్రయత్నించండి. అనుసరించవచ్చు.
ఆన్‌లైన్‌లో ఆధార్ జనాభా వివరాలను ఎలా అప్‌డేట్ చేయాలంటే?
- UIDAI వెబ్‌సైట్‌లోని ఆధార్ సెల్ఫ్ సర్వీస్ పోర్టల్‌ని విజిట్ చేయండి.
- మీ ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయడం ద్వారా పోర్టల్‌కి లాగిన్ అవ్వండి,
- ఆ తర్వాత మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు OTP వస్తుంది.
- డాక్యుమెంట్ అప్‌డేట్‌పై క్లిక్ చేసి ఇప్పటికే ఉన్న వివరాలను చెక్ చేసి వెరిఫై చేసుకోండి.
- డ్రాప్-డౌన్ లిస్టును ఉపయోగించి వెరిఫికేషన్ కోసం ఒరిజినల్ డాక్యుమెంట్‌ల స్కాన్ చేసిన కాపీలను ఎంచుకోవాలి. ఆపై Upload చేయండి.
- మీ వివరాలను అప్‌డేట్ చేసే ప్రక్రియను ట్రాక్ చేసేందుకు సర్వీసు రిక్వెస్ట్ నంబర్‌ను గుర్తించుకోవాలి.
తాజా వార్తలు
- Insta TV యాప్‌ను విడుదల చేసిన మెటా
- WPL 2026 షెడ్యూల్ విడుదల..
- లాస్ ఏంజిల్స్ లో కొత్త ఇండియన్ కాన్సులర్ సెంటర్
- టాటా, ఇన్ఫోసిస్ కంపెనీలకు H-1B వీసా షాక్
- IPLకు కరీంనగర్ యువకుడు ఎంపిక
- ప్రధాని మోదీకి అరుదైన గౌరవం
- ఒమన్‌లో భారత ప్రధాని..పలు ఒప్పందాలు..!!
- ఫుడ్ ట్రక్ యజమానులకు స్మార్ట్ లైసెన్స్‌లు..!!
- వరి ధాన్యాలతో.. కన్నడ సంఘ బహ్రెయిన్ ప్రపంచ రికార్డు..!!
- దుబాయ్ లో ట్రాఫిక్ సిగ్నల్ల క్లీనింగ్ కు డ్రోన్లు..!!







