భారత్ లో భారీగా పెరిగిన కోవిడ్ కేసులు..
- March 26, 2023
న్యూ ఢిల్లీ: భారత్ లో కోవిడ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.గడిచిన 24 గంటల్లో దేశంలో 1,890 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాదాపు ఐదు నెలల తర్వాత.. అంటే 149 రోజుల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదవ్వడం ఇదే మొదటిసారి. చివరగా గత అక్టోబర్ 28న 2,208 కేసులు నమోదయ్యాయి.
కోవిడ్ కేసులు పెరిగిపోతుండటంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరికలు జారీ చేసింది. కోవిడ్ నియంత్రణ చర్యలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రస్తుతం దేశంలో కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 9,433గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనాతో ఇప్పటిరవరకు 5,30,831 మంది మరణించారు. గడిచిన 24 గంటల్లో ఏడుగురు చనిపోయారు. మహారాష్ట్రలో ఇద్దరు, గుజరాత్‌లో ఇద్దరు, కేరళలో ముగ్గురు మరణించారు. తాజాగా నమోదైన కేసుల్లో ఢిల్లీ, ముంబై వాటా ఎక్కువగా ఉంది. ఢిల్లీలో శుక్రవారం 152 కరోనా కేసులు నమోదుకాగా, శనివారం 139 కేసులు నమోదయ్యాయి.
ఢిల్లీలో పాజిటివిటీ రేటు 4.98 శాతంగా ఉంది. మహారాష్ట్రలో శనివారం 437 కేసులు నమోదయ్యాయి. దేశంలో డైలీ పాజిటివిటీ రేటు 1.56 శాతంగా ఉండగా, వీక్లీ పాజిటివిటీ రేటు 1.29 శాతంగా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య 0.02శాతంగా, రికవరీ రేటు 98.79 శాతంగా ఉంది. ఇప్పటివరకు మొత్తం 4,47,04,147 కోవిడ్ కేసులు (4.47 కోట్లు) నమోదయ్యాయి. కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,41,63,883. మరణాల శాతం 1.19 శాతం. దేశంలో ఇప్పటివరకు 220.65 కోట్ల వ్యాక్సిన్లు పూర్తయ్యాయి.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







