ఒమన్ లో తగ్గిన చేపల వినియోగం!

- March 27, 2023 , by Maagulf
ఒమన్ లో తగ్గిన చేపల వినియోగం!

మస్కట్: 2022 చివరి నాటికి ఒమన్ సుల్తానేట్‌లో చేపల వినియోగ పరిమాణం 21.9 శాతం తగ్గి 718,726 టన్నులకు చేరుకుంది. 2021లో అదే కాలంతో పోలిస్తే అది 920,241 టన్నులుగా ఉంది. 2022లో చేపల మొత్తం విలువ OMR 423,568,000 కాగా.. 2021లో ఇది OMR 420,927,000గా ఉంది. నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (NCSI) విడుదల గణాంకాల ప్రకారం..  డిసెంబర్ 2022 చివరినాటికి ఆర్టిసానల్ ఫిషింగ్ ద్వారా అత్యధికంగా దిగుమతి అయిన చేపలు అల్ వుస్తాలోని గవర్నరేట్‌లో 245,895 టన్నులు, ఆ తర్వాత సౌత్ అల్ షర్కియా గవర్నరేట్‌లో 206,558 టన్నులుగా ఉంది. ఇక ఉత్తర, దక్షిణ అల్ బతినాలోని గవర్నరేట్‌లలో 71,639 టన్నులు, ధోఫర్ గవర్నరేట్ 68,968 టన్నులతో, ముసందమ్ గవర్నరేట్ 36,862 టన్నులతో.. మస్కట్ గవర్నరేట్ 34,967 టన్నుల చేపలు దిగుమతి అయ్యాయి.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com