యూఏఈ ప్రెసిడెంట్ కోసం ఇఫ్తార్ విందునిచ్చిన షేక్ మొహమ్మద్
- March 27, 2023
యూఏఈ: యూఏఈ అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్... యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి , దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. దుబాయ్‌లోని జబీల్ ప్యాలెస్‌లో షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కోసం షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, దుబాయ్ ఉప పాలకుడు, యూఏఈ ఉప ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి హిస్ హైనెస్ షేక్ మక్తూమ్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కూడా హాజరయ్యారు. ఇఫ్తార్ విందులో అల్ ధాఫ్రా ప్రాంతంలో పాలకుల ప్రతినిధి షేక్ హమ్దాన్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కూడా పాల్గొన్నారు. వీరితోపాటు అబుదాబి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ డిప్యూటీ ఛైర్మన్ షేక్ హజ్జా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ఉప ప్రధాన మంత్రి-అంతర్గత వ్యవహారాల మంత్రి లెఫ్టినెంట్ జనరల్ షేక్ సైఫ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ఉప ప్రధాన మంత్రి -అధ్యక్ష న్యాయశాఖ మంత్రి షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, , విదేశీ వ్యవహారాలు - అంతర్జాతీయ సహకార మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ లతోపాటు అనేక మంది మంత్రులు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







