‘గేమ్ ఛేంజర్’గా రామ్ చరణ్.!
- March 27, 2023మెగా పవర్ స్టార్ రామ్ చరన్ బర్త్‌డే సందర్భంగా ఈ రోజు ఆయన తాజా చిత్రానికి సంబంధించి టైటిల్ రిలీజ్ చేశారు. రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్లో వస్తున్న చిత్రానికి సంబంధించి అనేక రకాల టైటిల్స్ పరిశీలనలో వున్నాయ్ ఇంతవరకూ.
వాటన్నింటినీ తిప్పి కొడుతూ ఓ సరికొత్త టైటిల్‌ని రామ్ చరణ్ సినిమాకి ఫిక్స్ చేస్తూ అందరికీ షాకిచ్చింది శంకర్ అండ్ టీమ్. ‘గేమ్ ఛేంజర్’ అనే టైటిల్‌ని ఈ సినిమాకి ఫిక్స్ చేశారు.
ఈ టైటిల్‌పై ఫ్యాన్స్ ఫుల్ శాటిస్‌ఫైడ్‌గా వున్నారు. చాలా క్యాచీగా వుంది ఈ టైటిల్. టైటిల్‌ని బట్టి సినిమా పక్కా హిట్టు సినిమా.. అని ఫిక్సయిపోతున్నారు. కాగా, పక్కా పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో రూపొందుతోన్న ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు డిఫరెంట్ వేరియేషన్స్ వున్న పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.
కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో దిల్ రాజుతో పాటూ, ఎస్.జె.సూర్య, సునీల్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
- సౌదీలో BON TUM మయోనైజ్ పై నిషేధం
- రస్ అల్ ఖైమాలో గాయపడ్డ వ్యక్తి ఎయిర్‌లిఫ్ట్
- మే14 వరకు ‘మ్యాంగో మానియా’ మహోత్సవం
- విదేశీయుల నియామకం..రెస్టారెంట్ యజమానికి భారీ ఫైన్
- ఒమన్‌ను సందర్శించిన ప్రముఖ భారతీయ సామాజిక కార్యకర్తలు
- 'నిద్రపోతున్న' టీచర్ని ఫోటో తీసినందుకు Dh2000 జరిమానా
- ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక..
- చిన్నారి మృతదేహాన్ని ఎయిర్‌పోర్ట్‌లో వదిలేసిన సిబ్బంది
- అమీరాతో బిగ్ బాస్ 16 ఫేమ్ అబ్దు రోజిక్ నిశ్చితార్థం