సమంతకి ఆ వుద్దేశ్యం లేదా.?
- March 27, 2023
నాగ చైతన్యతో విడాకుల అనంతరం సమంతకి క్రేజ్ మరింత పెరిగిపోయిందని చెప్పొచ్చు. సినిమాల్లో అవకాశాలే కాదు.. ఫ్యాన్స్ నుంచి బోలెడంత సింపథీ కూడా వచ్చేసింది. అందులోనే మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడడం మరింత సింపథీని గైన్ చేసింది సమంతకి.
సమంత ప్రస్తుతం ‘శాకుంతలం’ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా వున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మీడియాతో, ఫ్యాన్స్‌తో ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతూ వస్తోంది. అందులో భాగంగానే సోషల్ మీడియాలో ఓ నెటిజన్ సమంతకు మళ్లీ లవ్‌లో పడమంటూ సలహా ఇచ్చాడు.
అందుకు సమంత షాకింగ్ సమాధానం ఇచ్చింది. మీలా నన్ను ఇంకెవరు ప్రేమిస్తారు.? అంటూ అభిమానులనుద్దేశించి పేద్ద బిస్కెట్ వేసింది సమంత. దాంతో పొంగిపోయిన ఫ్యాన్స్.. అహో.! సమంతకి ఇకపై మరొకర్ని ప్రేమించే వుద్దేశ్యం అస్సలు లేదనే వుద్దేశ్యానికి వచ్చేశారు.
అన్నట్లు సమంత, ప్రస్తుతం ఓ వైపు ‘శాకుంతలం’ ప్రమోషన్స్‌లో పాల్గొంటూనే, మరోవైపు టాలీవుడ్‌లో ‘ఖుషి’ సినిమా.. అలాగే హిందీలో ‘సిటాడెల్’ వెబ్ సిరీస్‌లోనూ నటిస్తోంది.
తాజా వార్తలు
- నాట్స్ విస్తరణలో మరో ముందడుగు షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్
- పాక్ ఆరోపణల పై భారతం ఘాటుగా స్పందన!
- రామమందిర నిర్మాణానికి భక్తుల విరాళం రూ.3వేల కోట్ల పైనే..
- బ్రెస్ట్ క్యాన్సర్ పై నాట్స్ అవగాహన సదస్సు
- తిరుమలలో వైభవంగా శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ సంబరాలు
- అమెరికాలో ఘనంగా ఆటా మహాసభల కిక్ ఆఫ్!
- జస్టిస్ సూర్యకాంత్ కొత్త సీజేఐ!
- ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో “దండక సాహిత్యం–ఉనికి, ప్రాభవం' సభ విజయవంతం
- నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ: సీఎం చంద్రబాబు
- నవంబర్‌లో బ్యాంకులకు సెలవులే సెలవులు







