డయాబెటిస్ రోగులకి ఈ ఆకులు ఓ ఔషధం.!
- March 27, 2023 
            సీతాఫలం ఎంతో బలం అంటారు. అవును నిజమే బలమే కాదు, ఎంతో రుచికరం కూడా ఈ ఫలం. అయితే, ఈ పండులో అధిక మోతాదులో చక్కెర స్థాయిలు వుండడం వల్ల డయాబెటిస్ వున్న వాళ్లు ఈ పండుకు దూరంగా వుండమని సూచిస్తుంటారు.
అయితే, సీతా ఫలం.. పండు సంగతెలా వున్నా వీటి ఆకులు మాత్రం డయాబెటిక్ రోగులకు ఓ వరమే అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.
ఆయుర్వేదపరంగానే కాదు, వైద్య ప్రామాణికంగానూ ఈ ఆకులకు డయాబెటిస్ తగ్గించే శక్తి వుందని కొన్ని అధ్యయనాల ద్వారా వెల్లడైంది.
రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో వుంచడం ద్వారా డయాబెటిస్‌ని అదుపులో వుంచొచ్చు. సీతాఫలం ఆకుల్లో యాంటీ డయాబెటిక్ లక్షణాలున్నట్లు తాజా అధ్యయనాల్లో బయటపడింది. ఈ ఆకులను తినడం వల్ల ప్యాంక్రియాసిస్‌లో ఇన్సులిన్ ఉత్పత్తి పెరిగి రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో వుంటాయట.
సో, డయాబెటిక్ రోగులకు ఈ ఆకులు చాలా ఉపయోగకరమైనవిగా చెబుతున్నారు. రోజూ రెండు ఆకులను నమిలి తినడం వల్ల షుగర్ అదుపులో వుంటుందంటున్నారు.
తాజా వార్తలు
- హాస్పిటల్లో దిగ్గజ నటుడు ధర్మేంద్ర
- నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు రూ. 10 వేల పరిహారం: సీఎం రేవంత్
- ఆసియా కప్ ట్రోఫీపై BCCI ఆగ్రహం!
- శ్రీవారి సేవ పై టీటీడీ ఈఓ సమీక్ష
- ఏపీలో 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి సర్కార్ గ్రీన్ సిగ్నల్!
- వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్..
- భారత్-అమెరికా మధ్య కీలక ఒప్పందం
- బహ్రెయిన్ లో అందుబాటులోకి రెండు కొత్త పార్కులు..!!
- ఖతార్ లో టీన్ హబ్ యూత్ ఫెస్ట్ 2025 ప్రారంభం..!!
- యూఏఈలో నవంబర్ కు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!!







