బెల్లంకొండ బాలీవుడ్ భవిష్యత్తు ‘ఛత్రపతి’ చేతిలోనే.!
- March 27, 2023 
            ‘ఛత్రపతి’ అంటే గుర్తొచ్చేది ప్రబాస్. రాజమౌళి, ప్రబాస్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఛత్రపతి’ సినిమా ప్రబాస్‌ని హీరోగా నెక్స్‌ట్ లెవల్‌కి తీసుకెళ్లిందని చెప్పొచ్చు. అయితే, ఇప్పుడు మనం మాట్లాడుకునే ఛత్రపతి హిందీ ఛత్రపతి. అవునండీ.. ప్రబాస్ నటించిన ‘ఛత్రపతి’ సినిమాని హిందీలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రీమేక్ చేస్తున్నారు.
టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ఈ సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా వేసవి కానుకంగా మేలో రిలీజ్‌కి సిద్ధంగా వుంది. కాగా, ఈ సినిమా నుంచి తాజాగా ఓ లుక్ రిలీజ్ చేశారు.
ఈ లుక్‌లో బెల్లంకొండ కండలు తిరిగిన దేహంతో లుక్ పరంగా బాహుబలిలోని ప్రబాస్‌ని మ్యాచ్ చేసేలా వున్నాడు. అయితే, తెలుగులో ‘ఛత్రపతి’ అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది.
మరి, హిందీ ‘ఛత్రపతి’ ఏం చేస్తుందో చూడాలి మరి. పక్కా యాక్షన్ డ్రామాగా ఈ సినిమాని తెరకెక్కించారు. ప్యాన్ ఇండియా వచ్చాకా, సినిమాకి భాషా పరమైన హద్దుల్లేవ్. బాగుందని టాక్ వస్తే చాలు.. ఏ భాషలోనైనా ఆ సినిమాకి పట్టం కట్టేస్తున్నారు. చూడాలి మరి, హిందీ ‘ఛత్రపతి’ బెల్లంకొండకు ఎంత మేర కలిసొస్తుందో.!
తాజా వార్తలు
- నాట్స్ విస్తరణలో మరో ముందడుగు షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్
- పాక్ ఆరోపణల పై భారతం ఘాటుగా స్పందన!
- రామమందిర నిర్మాణానికి భక్తుల విరాళం రూ.3వేల కోట్ల పైనే..
- బ్రెస్ట్ క్యాన్సర్ పై నాట్స్ అవగాహన సదస్సు
- తిరుమలలో వైభవంగా శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ సంబరాలు
- అమెరికాలో ఘనంగా ఆటా మహాసభల కిక్ ఆఫ్!
- జస్టిస్ సూర్యకాంత్ కొత్త సీజేఐ!
- ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో “దండక సాహిత్యం–ఉనికి, ప్రాభవం' సభ విజయవంతం
- నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ: సీఎం చంద్రబాబు
- నవంబర్‌లో బ్యాంకులకు సెలవులే సెలవులు







