పవన్ ‘ఓజీ’ కోసం బాలీవుడ్ గ్లామర్ అద్దబోతున్నారా.?
- March 28, 2023
సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాకి ‘ఓజీ’ అనే టైటిల్ పెట్టిన సంగతి తెలిసిందే. మొన్నీ మధ్యనే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంఛ్ చేశారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నాడనీ తెలుస్తోంది.
కాగా, ఈ సినిమా కోసం బాలీవుడ్ హీరోయిన్ని పరిశీలిస్తున్నారట. ఆమె ఎవరో కాదు, అనుష్క శర్మ అని ప్రచారం జరుగుతోంది. అనుష్క శర్మ ఓకే అంటే, ఇదే ఆమెకు తెలుగులో తొలి సినిమా అవుతుంది.
అలాగే, మరో హీరోయిన్‌కీ ఈ సినిమాలో ఛాన్స్ వుందట. టాలీవుడ్ నుంచి ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీలీల పేరు బాగా వినిపించింది. చూడాలి మరి, ఎవరు ఫైనల్ అవుతారో. అన్నట్లు ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ 90 రోజులు డేట్లు కేటాయించారు. ప్రస్తుతం ‘వినోదయ సితం’, ‘హరి హర వీరమల్లు’ సినిమాలతో బిజీగా వున్నారాయన.
తాజా వార్తలు
- బీఆర్ఎస్ కార్యాలయం పై దాడి ఘటన..
- జోగి రమేశ్ అరెస్ట్‌పై వైఎస్ జగన్ కీలక కామెంట్స్..
- మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున పరిహారం..
- నా కుటుంబంపై క్రిమినల్ కేసులు పెట్టారు: మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
- తెలంగాణ: త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా #ArriveAlive రోడ్డు భద్రతా కార్యక్రమం ప్రారంభం
- IBPC వార్షిక అవార్డుల షెడ్యూల్ విడుదల..!!
- యూఏఈలో విజిట్ వీసా స్పాన్సర్స్ కు న్యూ రూల్స్..!!
- ఒమన్ లో కార్నిచ్ నివారణకు స్పెషల్ ఆపరేషన్..!!
- సౌదీలో రెసిడెన్సీ, వర్క్, బార్డర్ చట్టాల ఉల్లంఘనల పై కొరడా..!!
- ఖతార్ లో సైబర్ మోసాల పై హెచ్చరిక జారీ..!!







