‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’లో అనుష్క శెట్టి ఎలా కనిపిస్తుందంటే.!
- March 28, 2023అనుష్క అంటే ఆరడుగుల అందాల చెక్కిన శిల్పం కళ్ల ముందు మెదులుతూ వుంటుంది. అందుకే అనుష్కని ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి అనిపించదు. ఫ్యాన్స్ ఆమెని స్వీటీ అని క్యూట్‌గా పిలచుకుంటుంటారు.
అయితే, ‘సైజ్ జీరో’ సినిమాని అనుష్కని ఆ స్వీట్నెస్కి దూరం చేసేసింది. సినిమా కోసం చేసిన ప్రయత్నం బెడిసి కొట్టి, ఏకంగా కెరీర్‌నే దెబ్బ తీసేసింది. సినిమా కోసం బొద్దుగా మారిన అనుష్క ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా సన్నబడలేకపోయింది.
దాంతో, కెరీర్లో వెనకబడిపోయింది. అప్పుడెప్పుడో ‘నిశ్శబ్ధం’ సినిమాలో నటించిన అనుష్క మళ్లీ త్వరలో నవీన్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో ఓ డిఫరెంట్ రోల్లో అనుష్క కనిపించబోతోంది. ఆమె పాత్ర పేరుతో కూడిన పోస్టర్ కూడా రిలీజ్ చేశారనుకోండి. ఛెఫ్ పాత్రలో అనుష్క కనిపించబోతోంది. అయితే, ఈ సినిమాలోనూ అనుష్క బొద్దుగానే కనిపించనుందనీ తెలుస్తోంది.
ఏమాత్రం సన్నబడలేదట. అయితే, కమర్షియల్ హీరోయిన్ రోల్ కాదు కాబట్టి.. ఈ సినిమాకి ఓకే అంటున్నారు. కానీ, అనుష్కని మళ్లీ పాత అనుష్కలా స్లిమ్ అండ్ స్లీకీగా చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అది జరుగుతుందా.?
తాజా వార్తలు
- ఖతార్‌లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్‌లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్‌కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!