కొవిడ్ తర్వాత భారీగా పెరిగిన వీసా దరఖాస్తులు..

- March 29, 2023 , by Maagulf
కొవిడ్ తర్వాత భారీగా పెరిగిన వీసా దరఖాస్తులు..

హైదరాబాద్: హైదరాబాద్‌ నుంచి వీసా దరఖాస్తుల సంఖ్య 2019 కొవిడ్ ముందు కాలం నాటితో పోలిస్తే చాలా పెరిగింది. మరీ ముఖ్యంగా అంతర్జాతీయ సరిహద్దులు తెరవడం, కొవిడ్‌ సంబంధిత మార్గదర్శకాలను సరళీకృతం చేయడంతో ఈ డిమాండ్‌ ఇంకా పెరిగింది. వీఎఫ్‌ఎస్‌ గ్లోబల్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ నుంచి దరఖాస్తుల సంఖ్య పరంగా చూస్తే 2019 కొవిడ్‌ ముందస్తు నాటి దరఖాస్తులతో ప్రస్తుతం 95%కు చేరుకుంది. అంతేకాదు 2021తో పోలిస్తే ఏకంగా 129% వృద్ధి కనిపించింది.

ఈ విషయమై వీఎఫ్‌ఎస్‌ గ్లోబల్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ (సౌత్‌ ఆసియా) ప్రబుద్ధ సేన్‌ స్పందిస్తూ ‘‘భారతదేశం నుంచి 2022లో మేము అసాధారణ డిమాండ్‌ను చూశాము. అసాధారణ ఔట్‌బౌండ్‌ ట్రావెల్‌ సీజన్‌గా ఇది నిలవడంతో పాటుగా డిసెంబర్‌ నెల వరకూ కూడా స్ధిరంగా దరఖాస్తులను చూస్తూనే ఉన్నాము. ఈ వేగం మరింతగా పెరగనుందని మేము ఆశిస్తున్నాము. అందువల్ల, వీసా దరఖాస్తుదారులు తమ దరఖాస్తులను ముందుగానే పెట్టవలసనదిగా సూచిస్తున్నాము. తద్వారా చివరి నిమిషంలో ఊహాతీత సంఘటనలను అధిగమించవచ్చు’’ అని అన్నారు.

మహమ్మారి ప్రారంభం నుంచి ఈ సేవలను ఎక్కువ మంది కోరుతున్నారు. ప్రీమియం ఆప్షనల్‌ సేవలు అయినటువంటి వీసా ఎట్‌ డోర్‌ స్టెప్‌ (VATD) వంటివి యాత్రికులు తమ వీసా అనుభవాలను తాము కోరుకునే ప్రాంతాలలో పొందే అవకాశం కల్పిస్తుంది. ఈ సేవలకు 2022లో రెండు రెట్ల వృద్ధి కనిపించింది. భారతదేశంలో ఆస్ట్రియా, చెక్‌ రిపబ్లిక్‌, డెన్మార్క్‌, ఈస్ట్రోనియా, ఫిన్లాండ్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, హంగేరీ, ఐస్‌ల్యాండ్‌, ఇటలీ, లథయానియ, లగ్జంబర్గ్‌, స్లోవేనియా,స్విట్జర్లాంగ్‌, యూకే వంటి దేశాలకు వీసాలు ఎక్కువగా పెరిగాయని వీఎఫ్‌ఎస్‌ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com