తెలంగాణ: ఏప్రిల్ 25 నుండి విద్యాసంస్థలకు వేసవి సెలవులు
- March 29, 2023
హైదరాబాద్: విద్యాసంస్థలకు సంబంధించి వేసవి సెలవులు తేదీని ఖరారు చేసింది తెలంగాణ సర్కార్. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు ఏప్రిల్ 25 నుంచి జూన్ 11వ తేదీ వరకు ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించింది. 2023-24 విద్యాసంవత్సరానికి గానూ జూన్ 12న పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. ఒకటి నుంచి తొమ్మిదవ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 12 నుంచి 20 ఎస్ఏ-2 పరీక్షలు నిర్వహించనున్నారు. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి.
ఆరో తరగతి నుంచి ఎనమిదో తరగతి వరకు విద్యార్థులకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఉన్న విద్యార్థుల పరీక్ష పత్రాలను ఏప్రిల్ 21 నుంచి 24 వరకు మూల్యాకణం చేసి మార్క్స్ ని ప్రకటిస్తారు. 25వ తేదీన పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించి, విద్యార్థుల మార్కులను తల్లిదండ్రులకు తెలిపి, వేసవి సెలవులు ప్రకటించనున్నారు.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం