సౌదీలలో 8 శాతానికి తగ్గిన నిరుద్యోగం..!
- March 31, 2023
రియాద్ : సౌదీలలో నిరుద్యోగిత రేటు గణనీయమైన తగ్గుదలని నమోదు చేసిందని జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ (GASTAT) వెల్లడించింది. ఇది 2022 నాల్గవ త్రైమాసికంలో 8 శాతానికి చేరుకుందని పేర్కొంది. మూడవ త్రైమాసికంలో నిరుద్యోగిత రేటు 9.9 శాతంగా ఉంది. GASTAT విడుదల చేసిన లేబర్ మార్కెట్ బులెటిన్ ప్రకారం.. 2022 మూడవ త్రైమాసికంతో పోలిస్తే సౌదీ మొత్తం జనాభాలో నిరుద్యోగిత రేటు 4.8 శాతానికి చేరుకుంది. సాధారణంగా సౌదీలకు నిరుద్యోగిత రేటులో తగ్గుదల ఉన్నప్పటికీ, 2022 నాల్గవ త్రైమాసికంలో సౌదీ మహిళల నిరుద్యోగం గణనీయంగా పడిపోయిందని, గత త్రైమాసికంలో 20.5 శాతంతో పోలిస్తే 15.4 శాతానికి చేరుకుందని GASTAT వెల్లడించింది. సౌదీ పురుషుల నిరుద్యోగిత రేటు గత త్రైమాసికంలో 4.3 శాతంతో పోలిస్తే 4.2 శాతానికి తగ్గింది. సామాజిక బీమా వ్యవస్థలో నమోదైన కార్మికుల సంఖ్య రికార్డు స్థాయిలో 2.2 మిలియన్లకు చేరుకుంది. ప్రధానంగా మెరుగైన ప్రభుత్వ కార్యకలాపాలు, అలాగే ఉపాధి కల్పన ప్రక్రియలో ప్రైవేట్ రంగం పాత్ర కారణంగా నిరుద్యోగిత రేటు తగ్గిందని నివేదికలో పేర్కొన్నారు. కింగ్డమ్ విజన్ 2030 కింద ప్రణాళికలు, కార్యక్రమాలు, సంస్కరణలు, చట్టాలు అత్యధిక శ్రామిక శక్తి భాగస్వామ్య రేటును సాధించడంలో దోహదపడ్డాయని నివేదిక తెలిపింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







