U21 వరల్డ్ వాలీబాల్ ఛాంపియన్‌షిప్‌కు బహ్రెయిన్ ఆతిథ్యం
- April 01, 2023
బహ్రెయిన్: ఈ వేసవిలో ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి వాలీబాల్ (FIVB) పురుషుల U21 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు బహ్రెయిన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ టోర్నమెంట్ జూలై 7 నుండి 16 వరకు జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐదు సమాఖ్యల నుండి 16 జట్లు ఇందులో పాల్గొంటాయి. రిఫాలోని ఇసా స్పోర్ట్స్ సిటీలోని బహ్రెయిన్ వాలీబాల్ అసోసియేషన్ ప్రధాన కార్యాలయంలోని ఇసా బిన్ రషీద్ ఎరీనాలో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ సంవత్సరం నాల్గవసారి బహ్రెయిన్ ప్రతిష్టాత్మకమైన ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. బహ్రెయిన్ మొదటిసారిగా 1987లో అండర్-21 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు ఆతిథ్యం ఇచ్చింది. ఆపై 1997, 2019లో నిర్వహించింది. బహ్రెయిన్ కూడా ఆతిథ్య దేశంగా అర్హత సాధించి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటోంది.
ప్రిలిమినరీ రౌండ్ కోసం పోటీ చేసే ఫీల్డ్‌ను నాలుగు పూల్స్‌గా విభజించారు. బహ్రెయిన్, ఇరాన్, థాయిలాండ్, ట్యునీషియాలు పూల్ A లో ఉన్నారు. పూల్ Bలో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇటలీ, బ్రెజిల్, ఈజిప్ట్, మెక్సికో ఉన్నాయి. పూల్ Cలో పోలాండ్, బల్గేరియా, కెనడా, ఇండియా ఉన్నాయి. పూల్ D లో అర్జెంటీనా, బెల్జియం, చెక్ రిపబ్లిక్, అమెరికా ఉన్నాయి. ప్రతి పూల్ నుండి మొదటి రెండు జట్లు రెండవ దశ రౌండ్-రాబిన్ పూల్స్ E, F లకు చేరుకుంటాయి. మిగిలినవ జట్లు ఎనిమిదో నుండి 16వ స్థానాల కోసం పోరాటాలను కొనసాగించడానికి పూల్స్ G , Hలకు మారతాయి. E , F పూల్స్ విజేతలు, రన్నరప్‌లు సెమీ-ఫైనల్, ఫైనల్ కు చేరుకుంటారు.
అండర్-21 ప్రపంచ ఛాంపియన్ షిప్ చరిత్రలో బహ్రెయిన్ ఆరోసారి పోటీపడనుంది. 1987, 1989, 1997లలో.. 2019లో స్వదేశంలో.. 2021లో రెండు ఎడిషన్లలో పోటీపడ్డది. 1987, 2019లో రెండుసార్లు ఎనిమిదో స్థానం(అత్యుత్తమ ర్యాంక్)లో నిలిచింది. చివరి టోర్నమెంట్ ఫైనల్లో రష్యాను మూడు సెట్లలో ఓడించి ఇటలీ 2021లో విజేతగా నిలిచింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనాను ఓడించిన పోలాండ్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.
తాజా వార్తలు
- ప్రాంతీయ పరిణామాలు, ద్వైపాక్షిక సహకారం పై యూఏఈ అధ్యక్షుడు–బ్రిటన్ ప్రధాని చర్చలు
- కోల్‌కతా పై లక్నో విజయం
- ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అగ్నిప్రమాదం: టెర్మినల్-1 వద్ద టెన్షన్!
- సీజ్ఫైర్ ఒప్పందం..ఇరాన్ డిమాండ్స్, అమెరికా ప్రతిపాదనలు
- CPTOగా ప్రసన్న ప్రసాద్ నియామకం
- సీజ్ ఫైర్.. 2-3 నెలల్లో ప్రయాణికుల్లో విశ్వాసం..!!
- సౌదీ ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు..బహ్రెయిన్ ఫైర్..!!
- యుద్ధ విరమణ..యూఏఈ, కువైట్, బహ్రెయిన్ పై ఆగని దాడులు..!!
- 42 భవనాలు నేలమట్టం..కువైట్ మున్సిపాలిటీ ఆదేశాలు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు..సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!









