రమదాన్: డెలివరీ రైడర్లకు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్
- April 01, 2023
యూఏఈ: రమదాన్ మాసంలో ఉపవాసం ఉండే రైడర్లకు సౌకర్యవంతమైన పనిగంటలను ఆయా డెలివరీ కంపెనీలు కల్పిస్తున్నాయి. డెలివరీ రైడర్ ముహమ్మద్ బిలాల్ మాట్లాడుతూ.. సాధారణంగా రమదాన్ మాసంలో ఇఫ్తాల్ సమయంలో బిజీగా ఉంటుందన్నారు. అయితే సాయంత్రం 5.30 గంటల తర్వాత ఆహార పదార్థాలు ప్రత్యేకంగా ప్యాక్ చేయబడతాయని, కానీ మగ్రిబ్ అజాన్ బయలుదేరడానికి 10 నిమిషాల ముందు, తాను సమీపంలోని మస్జీదుకు వెళ్లి ఇఫ్తార్ కోసం విరామం తీసుకుంటానని తెలిపారు. ప్రార్థనలు ముగిసిన తర్వాత, తాను తిరిగి డ్యూటీలో చేరి డెలివరీ అందిస్తానని పేర్కొన్నారు. నివాసితులు ఇఫ్తార్ సమయంలో తమ ఆహారాన్ని ముందుగానే ఆర్డర్ చేయమని డెలివరీ కంపెనీలు కోరుతున్నాయి. లేదంటే ఫుడ్ డెలివరీలో జాప్యాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. కాగా, చాలా కంపెనీలు ఈ సమయంలో ఉపవాసం ఉన్న రైడర్‌లకు మేలు చేసేందుకు డెలివరీలను నిలిపివేస్తున్నాయి. సాధారణంగా రమదాన్ సందర్భంగా ట్రాఫిక్ ప్రమాదాలు పెరుగుతాయని, రోడ్డుపై వెళ్లేటప్పుడు వాహనదారులు, పాదచారులు మరింత జాగ్రత్తగా ఉండాలని రోడ్డు భద్రతా నిపుణులు ప్రతి సంవత్సరం పిలుపునిస్తున్నారు. యూఏఈ రోడ్‌సేఫ్టీ రమదాన్ యాక్సిడెంట్ సర్వేల ప్రకారం.. పీక్ ప్రమాద సమయాలు ఇఫ్తార్‌కు ముందు (మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల మధ్య), ఉదయం 8 నుండి 10 గంటల వరకు రద్దీ సమయంగా పేర్కొన్నారు. ఇఫ్తార్ సమయంలో అనేక మంది ప్రజలు వివిధ ప్రాంతాలకు బయలుదేరడంతో వాహనదారులు, డెలివరీ రైడర్లు ఈ సమయంలో జాగ్రత్తగా హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- సిక్కిం ఘటనపై భారత్‌కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్‌లో భారత పాస్‌పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్‌లో భారత రాయబారి విపుల్‌కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్







