టోల్ ఛార్జ్ బాదుడు ఫై వాహనదారులు గగ్గోలు
- April 01, 2023
న్యూ ఢిల్లీ: ఈరోజు (ఏప్రిల్ 01) నుండి టోల్ చార్జీలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. ఈ చార్జీల మోత ఫై వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. వాహనం స్థాయిని బట్టి 5 నుంచి 49 రూపాయల వరకు పెరిగింది టోల్ ఛార్జ్. నెలవారీ పాస్‌లపై 275 నుంచి 330 రూపాయల వరకు పెరిగాయి. జిల్లాల మీదుగా రాకపోకలు సాగించే వారికి సైతం టోల్ బాదుడు తప్పడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్ని కలిపే ఉమ్మడి నల్గొండ జిల్లాలో హైదరాబాద్-విజయవాడ 65వ నంబర్ జాతీయ రహదారి, హైదరాబాద్-వరంగల్ 163వ నంబర్ జాతీయ రహదారి చాలా కీలకం. ఈ రెండు హైవేల మీద వాహనాల రాకపోకల రద్దీ ఎక్కువగా ఉంటుంది.
గూడ్స్ వాహనాలపై కూడా బాదుడు షురూ కావడంతో లారీలు నడపలేని పరిస్థితిలో ఉన్నామంటున్నారు ఓనర్లు. అటు… పెరిగిన టోల్ భారాన్ని సీరియస్‌గా తీసుకుని ఆర్టీసీ ప్రయాణీకుడ్ని కూడా టార్గెట్ చేశాయి ప్రభుత్వాలు. టోల్ సేస్ పేరుతో భారీగా టికెట్ చార్జీలు వసూలు చేస్తోంది టీఎస్ ఆర్టీసి. APSRTC కూడా ప్రయాణికుల ఫై భారం మోపేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ టోల్ ఛార్జ్ బాదుడు ప్రతి ఒక్కరి ఫై పడుతుంది. కూరగాయలు , నిత్యావసరాలు ఇలా అన్నింటిపై భారం పడబోతోంది. ఇప్పటికే అంన్నింటికీ ధరలు పెంచిన కేంద్రం..ఇప్పుడు టోల్ చార్జీలను సైతం పెంచడం ఫై ప్రతి ఒక్కరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







