'NATS' ఆధ్వర్యంలో ఘనంగా తెలుగు జానపద సంబరాలు

- April 01, 2023 , by Maagulf
\'NATS\' ఆధ్వర్యంలో ఘనంగా తెలుగు జానపద సంబరాలు

విశాఖపట్నం: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) ఆధ్వర్యంలో విశాఖలోని మద్దిలపాలెం కళాభారతి ఆడిటోరియంలో శనివారం అమెరికా తెలుగు జానపద సంబరాలు ఉత్సాహపూరిత వాతావరణంలో సాగాయి. కళారూపాలు వెల్లివిరిశాయి. జానపద నృత్యాలు చూపరులను కట్టిపడేశాయి. ముఖ్యంగా మహిళా కళాకారులు 'సువ్వి సువ్వి' పాటకు చేసిన నృత్యం, డప్పులతో రఘు బృందం చేసిన నృత్యం వీక్షకుల మెప్పుపొందాయి. కళాకారులను అతిథులు ఘనంగా సత్కరించి, జ్ఞాపికలు అందజేశారు. సంబరాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రముఖ వైద్యులు, కవి డాక్టర్‌ పెదవీర్రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ నాయకులు తెలుగు భాషను టివిల్లో, సోషల్‌ మీడియాలో అపహాస్యం చేస్తున్న తరుణంలో అమెరికాకు చెందిన నాట్స్‌ తెలుగుపై మక్కువతో జానపద సంబరాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. జానపద కళలను ప్రజలు ఆదరించాలని కోరారు. నాట్స్‌ సమన్వయకర్త శ్రీధర్‌ అప్పసాని మాట్లాడుతూ ఈ ఏడాది మే 26, 27 తేదీల్లో అమెరికాలోని న్యూజెర్సీలో తెలుగు సంబరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నాట్స్‌ అధ్యక్షులు బాపు నూతి మాట్లాడుతూ గౌతు లచ్చన్న బలహీన వర్గాల సంస్థ, శ్రీమాతా కళాపీఠంతో కలిసి ఈ సంబరాలను నాట్స్‌ నిర్వహిస్తోందన్నారు. పల్లెలే దేశానికి పట్టుగొమ్మలని గుర్తు చేస్తూ గ్రామాల అభివృద్ధికి, కళలను పెంపొందించడానికి తాము కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.గ్లో సంస్థ కార్యదర్శి యార్లగడ్డ వెంకన్న చౌదరి మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో ఎంతోమంది జానపద కళాకారులున్నారని, వారిని ప్రోత్సహించాల్సిన అవసరముందని అన్నారు. రైటర్స్‌ అకాడమీ చైర్మన్‌ వివి.రమణమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాటక రంగంలో విశేష సేవలందించిన పద్మశ్రీ ఎడ్ల గోపాల్‌, ప్రొఫెసర్‌ మీగడ రామలింగం, శ్రీమాతా సంస్థ అధినేతలు బిఎన్‌.మూర్తి, పల్లి నాగభూషణరావు, ప్రజాకవి దేవిశ్రీ, కళాకారులు, కళాభిమానులు పాల్గన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com