వృద్ధులు, మహిళల పట్ల నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు: సీపీ చౌహాన్

- April 01, 2023 , by Maagulf
వృద్ధులు, మహిళల పట్ల నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు: సీపీ చౌహాన్

హైదరాబాద్: తెలంగాణ సీనియర్ సిటిజన్స్ సంఘం వారు నిర్వహించిన సదస్సులో పాల్గొన్న రాచకొండ కమిషనర్ డిఎస్ చౌహాన్, మహిళలు, వృద్ధుల పట్ల అమానుషంగా వ్యవహరించే వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నో ఏళ్ళు బాధ్యత గల పౌరులుగా విభిన్న రంగాలలో సేవలందించి, దేశ అభ్యున్నతికి కారణమైన వృద్ధుల పట్ల అందరూ గౌరవ భావంతో ఉండాలని సూచించారు.తమ శ్రమతో, ఎన్నో కష్ట నష్టాలు భరిస్తూ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల పట్ల పిల్లలు ప్రేమగా బాధ్యతతో ఉండాలని తెలిపారు. సమాజంలో వృద్ధాశ్రమాల అవసరం రాకూడదని అభిప్రాయపడ్డారు.   

రాచకొండ పోలిస్ కమిషనరేట్ పరిధిలో వయో వృద్ధులు మరియు మహిళల భద్రత కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు, వారి ఫిర్యాదుల పట్ల సత్వరమే స్పందించి తగిన విధంగా న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పిల్లల చేతిలో హింసను, నిరాదరణ ఎదుర్కొంటూ పోలీస్ స్టేషన్ కు స్వయంగా రాలేని బాధితులు రాచకొండ వాట్సాప్ కంట్రోల్ రూమ్ 9490617111 నంబర్ కి గానీ, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా తక్షణమే స్పందించి బాధితులకు సత్వర న్యాయం చేకూరుస్తామని ఈ సందర్బంగా కమిషనర్ తెలిపారు.

క్రైమ్ డీసీపి మధుకర్ స్వామి, తెలంగాణ సీనియర్ సిటిజన్స్ సంఘ సభ్యులు మరియు ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com