పిస్టల్స్ దొంగిలించిన ఐదుగురు వ్యక్తులకు జైలుశిక్ష
- April 02, 2023
మనామా: బహ్రెయిన్ మరణించిన వ్యాపారవేత్త ఇంటి నుండి పిస్టల్స్ దొంగిలించిన కేసులో ఐదుగురు ఆసియా వ్యక్తులకు స్థానిక కోర్టు జైలు శిక్ష విధించారు. విశ్వసనీయ సమాచారం మేరకు దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. విచారణ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించి వారెంట్ పొంది నిందితుల ఇళ్ల నుంచి పిస్టల్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. విచారణలో నిందితులు తమ నేరాలను అంగీకరించారని, వారు 2013 లో మరణించిన ఒక వ్యాపారవేత్త ఇంటి నుండి పిస్టల్స్ దొంగిలించినట్లు తెలిపారని పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద మూడు పిస్టల్‌లు లభించగా, ఒకటి మూడో అమ్మినట్లు.. మరొకటి పాడుబడిన భవనంలో దాచిపెట్టారన్నారు. నిందితులకు జరిపిన మెడికల్ టెస్టుల్లో డ్రగ్స్ పాజిటివ్‌గా తేలడంతో నిందితులపై డ్రగ్స్ సంబంధిత కేసులు కూడా నమోదు చేసినట్లు బహ్రెయిన్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!