సినిమా థియేటర్లలో మాస్క్ తప్పనిసరి చేసిన తమిళనాడు సర్కార్
- April 04, 2023
చెన్నై: భారత్ వ్యాప్తంగా మరోసారి కరోనా కేసులు పెరుగుతుండడం తో కేంద్రం పలు రాష్ట్రాలకు ఆంక్షలు విధిస్తోంది. ఈ క్రమంలో తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా థియేటర్లలో మాస్క్ తప్పనిసరిగా ధరించాలని ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కేసులు పెరుగుతుండడంతో ముందుజాగ్రత్త చర్యగా ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్లు వెల్లడించింది. థియేటర్లతో పాటు ఆసుపత్రులకు వెళ్లే రోగులు, రోగుల బంధువులు కూడా మాస్క్ ధరించాలని సూచించింది.
ఈ సందర్బంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ సెల్వ వినాయగం మీడియాతో మాట్లాడుతూ.. తమిళనాడులో కరోనా వైరస్ ప్రభావం తక్కువగానే ఉందని తెలిపారు. అయితే, ముందుజాగ్రత్త చర్యగా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వివరించారు. రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రులు, ఏసీ థియేటర్లు, ఆడిటోరియాలలో మాస్కులు ధరించాలని చెప్పారు. ఇక దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 59,512 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 3,641 కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో కొవిడ్ బారిన పడిన వారి సంఖ్య 4.47 కోట్లకు (4,47,26,246) చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 20 వేల మార్క్‌ను దాటింది. ప్రస్తుతం 20,219 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు కరోనా వైరస్ నుంచి 4.41 కోట్ల మంది (4,41,75,135) కోలుకున్నారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







