విటమిన్ ట్యాబ్లెట్లు విరివిగా వాడేస్తున్నారా.?

- April 04, 2023 , by Maagulf
విటమిన్ ట్యాబ్లెట్లు విరివిగా వాడేస్తున్నారా.?

విపరీతమైన అలసట, నీరసం నుంచి తేరుకోవడానికి సప్లిమెంట్ల రూపంలో డాక్టర్లు విటమిన్ ట్యాబ్లెట్లు సూచిస్తుంటారు. అవును నిజమే, విటమిన్స్ సప్లిమెంట్స్ శరీరానికి ఉత్సాహాన్ని నింపడంలో తోడ్పడతాయ్. కానీ, పెరిగిన ఇంటర్నెట్ వాడకం, విరివిగా దొరుకుతున్న విటమిన్ సప్లిమెంట్ల కారణంగా వీటి వాడకం బాగా పెరిగింది. 

వైద్యుని సలహా తీసుకోకుండానే విటమిన్ ట్యాబ్లెట్ల వాడకం ఇష్టానుసారం పెరిగిపోయింది. వైద్యుని సలహా లేకుండా అలా విటమిన్ల వాడకం సరి కాదని నిపుణులు సూచిస్తున్నారు. వాటి కారణంగా అనేక సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. 

అకస్మాత్తుగా బరువు పెరగడం, కడుపు తిమ్మిరి, జీర్ణ సమస్యలు, ఆకలి మందగించడం, అతిసారం తదితర తీవ్రమైన సమస్యలు తలెత్తే ప్రమాదముందని కొన్ని అధ్యయనాల ద్వారా తేలిందట. ఆకస్మిక గుండెపోటుకు కూడా ఇవి కారణమవుతాయని అంటున్నారు. సో, ఆఫ్ట్రాల్ విటమిన్ ట్యాబ్లెట్టే కదా.. అని అస్సలు లైట్ తీసుకోవద్దు సుమా.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com