లుంగీ ఎగ్గట్టేసిన రామ్ చరణ్.! ఎవరి కోసమో తెలుసా.?
- April 04, 2023
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమాలో గెస్ట్ రోల్ పోషిస్తున్నాడంటూ టాక్ వినిపించిన సంగతి తెలిసిందే.
అది జస్ట్ టాక్ కాదు. నిజ్జంగా నిజమే. తాజాగా ఓ ప్రోమో కూడా రిలీజ్ చేశారు. ఓ సాంగ్‌లో చరణ్ గెస్ట్‌గా కనిపించబోతున్నాడు.
విక్టరీ వెంకటేష్, సల్మాన్ ఖాన్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘కిసీ కీ భాయ్ కిసీ కీ జాన్’ సినిమా ఈ ఈద్‌కి ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
ప్యాన్ ఇండియా టార్గెట్‌గా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
ఆ నేపథ్యంలోనే ‘బతుకమ్మ బతుకమ్మ..’ పాటను తెలుగు వెర్షన్లో తెరకెక్కించారు ఈ సినిమాలో. రీసెంట్గా ఈ సాంగ్ ప్రోమోతో షాకిచ్చిన చిత్ర యూనిట్, తాజాగా మరో సాంగ్ ప్రోమో వదిలారు.
ఆ వీడియో సాంగ్‌లోనే సల్మాన్ ఖాన్, చరణ్, వెంకటేష్ ముగ్గురూ లుంగీలు ఎగ్గట్టేసి మాస్ స్టెప్పులు ఇరగదీస్తున్నారు. గతంలో షారూఖ్ ఖాన్ లుంగీ డాన్స్ తరహాలో ఈ సాంగ్ కూడా ఓ ఊపు ఊపేసేలా వుంది.
తాజా వార్తలు
- ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్‌కు ఆహ్వానం
- జేడీయూ షాక్ నిర్ణయం: 16 మంది నేతలకు బహిష్కరణ
- 3వ ప్రపంచ తెలుగు మహాసభలు–2026 ముఖ్యాంశాలు
- హరీశ్ రావు తండ్రి భౌతిక కాయానికి నివాళులర్పించిన కేసీఆర్..
- తీవ్ర తుపానుగా ‘మొంథా’.. ఏపీలో హైఅలర్ట్..
- దుబాయ్: ఏపీ మంత్రి టి.జి భరత్ తో మీట్ & గ్రీట్ ఏర్పాటు చేసిన INDEX ఎమిరేట్స్ గ్రూప్
- తెలుగు టైటాన్స్ vs పట్నా పైరేట్స్ పోరు
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు కొత్త చిప్‌తో కూడిన ఈ-పాస్‌పోర్ట్‌లు
- సౌదీలో 44 కొత్త ప్రొఫేషన్స్ లో స్థానికీకరణ అమలు..!!
- యూఏఈ లాటరీ Dh100-మిలియన్ల విజేత అనిల్‌కుమార్ బొల్లా..!!







