బంగ్లాదేశ్ లో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో 3,000 దుకాణాలు
- April 04, 2023
ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉన్న బట్టల బజారులో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అందులో ఉన్న సుమారు 3,000 దుకాణాలు మంటల్లో చిక్కుకున్నాయి. భారీ మంటలను ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది, ఆర్మీ సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దేశంలోనే క్లాత్ మార్కెట్లకు నిలయం బంగాబజార్. ఇరుకైన దుకాణాలు, పెద్ద ఎత్తున జనాలతో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఇందులోనే తెల్లవారుజామున రగులుకున్నాయి. అయితే ఈ అగ్నిప్రమాదంలో ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని బంగ్లా ప్రభుత్వ అధికారులు వెల్లడించారు.
ఈ విషయమై అగ్నిమాపక సేవ అధికారి రషీద్ బిన్ ఖలీద్ మాట్లాడుతూ 50 అగ్నిమాపక యూనిట్లు మంటలను ఆర్పడానికి పని చేస్తున్నాయని, అయితే మంటలు చెలరేగడానికి గల కారణాలు ఇంక తెలియలేదని అన్నారు. ‘‘చాలా దుకాణాలు మంటల్లో బూడిదయ్యాయి. అయితే లోపల ఎవరైనా చిక్కుకున్నారా అనే దానిపై ఎటువంటి సమాచారం లేదు. చాలా దుకాణాలు తెరవకముందే తెల్లవారుజామున మంటలు చెలరేగాయి’’ అని ఖలీద్ చెప్పారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







