సౌదీలో విదేశీయుల నియామకానికి కొత్త వ్యవస్థ..!

- April 05, 2023 , by Maagulf
సౌదీలో విదేశీయుల నియామకానికి కొత్త వ్యవస్థ..!

రియాద్: మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ (MHRSD) నైపుణ్యాల ఆధారంగా కొత్త రిక్రూట్‌మెంట్ సిస్టమ్ కోసం మూడు ప్రతిపాదిత నమూనాలను ప్రవేశపెట్టింది. సౌదీ వర్క్ వీసా వ్యవస్థను మెరుగుపరిచే లక్ష్యంతో మంత్రిత్వ శాఖ ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో ఈ నమూనాలు భాగంగా ఉన్నాయి. రాజ్యంలో ఉత్పాదకత, ఆవిష్కరణ స్థాయిలను పెంచే లక్ష్యంతో ప్రతిపాదిత నమూనాలు అధిక, మధ్యస్థ, తక్కువ అనే ముడు వర్గాలుగా వర్గీకరించారు.  మరింత నైపుణ్యం కలిగిన విదేశీ కార్మికులను ఆకర్షించే పథకంలో భాగంగా స్కిల్ వెరిఫికేషన్ ప్రోగ్రామ్ (SVP)ని గతేడాది ప్రారంభించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కార్యక్రమ మొదటి దశను ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో ప్రారంభించినట్లు గుర్తుచేసింది. మొదటి దశలో నైపుణ్య పరీక్ష కోసం ప్లంబర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, రిఫ్రిజిరేషన్/ఎయిర్ కండిషనింగ్ టెక్నీషియన్, ఆటోమొబైల్ ఎలక్ట్రీషియన్ వంటి ఐదు వృత్తులను ఎంపిక చేశారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com