ఉద్యోగి జీతాన్ని యజమాని ఎప్పుడు నిలిపివేయవచ్చంటే?

- April 05, 2023 , by Maagulf
ఉద్యోగి జీతాన్ని యజమాని ఎప్పుడు నిలిపివేయవచ్చంటే?

యూఏఈ: యూఏఈలోని శ్రామిక శక్తిలో దాదాపు 90 శాతం మంది ప్రవాసులే. వారు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో పనిచేస్తున్నారు. కొన్ని పరిస్థితులలో ఒక యజమాని తమ ఉద్యోగి జీతాన్ని నిలిపివేయవచ్చని నాసర్ యూసుఫ్ అల్ ఖమీస్ అడ్వకేట్స్, లీగల్ కన్సల్టెంట్స్‌లో సీనియర్ లీగల్ అసోసియేట్ అయిన నవన్‌దీప్ మట్టా తెలిపారు. ఆర్టికల్ 25 (1 & 2) కింద పేర్కొన్న ఏడు సందర్భాలలో  యజమాని కార్మికుని వేతనాన్ని నిలిపివేయవచ్చని వెల్లడించారు.

- ఎలాంటి వడ్డీ లేకుండా కార్మికుడికి మంజూరు చేసిన రుణాల కోసం.. కార్మికుని అమోదంతో జీతాన్ని గరిష్ఠ పరిమితి లోపు మాత్రమే తీసివేయవచ్చు.

- కార్మికుడికి అందజేసే జీతంలో ఇలా నిలిపివేతలు మొత్తం వేతనంలో 20 శాతానికి మించరాదు.

- రాష్ట్రంలో అమలులో ఉన్న చట్టం ప్రకారం బోనస్‌లు, పదవీ విరమణ పెన్షన్‌లు, బీమా కోసం జీతాన్ని కట్ చేయవచ్చు.

-  సేవింగ్స్ ఫండ్‌కు లేదా మంత్రిత్వ శాఖ ఆమోదించిన ఫండ్‌కు చెల్లించాల్సిన లోన్‌లకు కార్మికుని వంతు మొత్తాన్ని తగ్గించవచ్చు.

- ఏదైనా సామాజిక ప్రాజెక్ట్ లేదా యజమాని అందించిన, మంత్రిత్వ శాఖ ఆమోదించిన ఏవైనా ఇతర ప్రయోజనాల కోసం జీతాన్ని కట్ చేయవచ్చు.

- సర్వీస్ నిబంధనల ఉల్లంఘనల కారణంగా కార్మికుడి జీతం తగ్గించవచ్చు. అయితే, అది వేతనంలో 5 శాతానికి మించకూడదు.

- కోర్టుల తీర్పు ప్రకారం చెల్లించాల్సిన అప్పులు, కార్మికుడికి చెల్లించాల్సిన వేతనంలో పావు వంతుకు మించకుండా తీసివేయవచ్చు

-  వేతనం నుండి తగ్గింపు లేదా నిలిపివేతకు అనేక కారణాలు ఉంటే, అన్ని సందర్భాల్లో తగ్గింపు /నిలిపివేత శాతం వేతనంలో 50 శాతానికి మించరాదు.

ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలు, నిబంధనల మేరకు.. యజమాని తన ఉద్యోగి నుండి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రయాణ భత్యాన్ని తగ్గించలేరు. అతని నగదు భత్యం నుండి సర్దుబాటు చేయలేరు. ఉపాధి ఒప్పందంపై సంతకం చేసే ముందు వార్షిక రిటర్న్ టిక్కెట్‌ను స్పష్టం చేయాలని కార్మికులకు సూచించబడిందని మట్టా అన్నారు. అయితే, సమర్థ న్యాయస్థానం ఆమోదంతో తప్ప, అంతకంటే ఎక్కువ మొత్తాన్ని మినహాయించడం అనుమతించబడదని ఆయన తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com