స్మార్ట్ సిటీ ఇండెక్స్‌లో 4 సౌదీ నగరాలు
- April 07, 2023
రియాద్ : 2023 కోసం IMD స్మార్ట్ సిటీ ఇండెక్స్‌లో నాలుగు సౌదీ నగరాలు స్థానం సంపాదించాయి. ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ (IMD) విడుదల చేసిన ఇండెక్స్ ప్రకారం.. సౌదీ రాజధాని నగరం రియాద్ మూడవ స్వార్ట్ అరబ్ నగరంగా తన స్థానాన్ని పదిలం చేసుకుంది. అరబ్ ప్రపంచంలో మక్కా 4వ ర్యాంక్‌తో ఈ ఏడాది తొలిసారిగా ఇండెక్స్‌లో ప్రవేశించగా, జెడ్డా 5వ ర్యాంక్‌తో, మదీనా 7వ ర్యాంక్‌లో నిలిచాయి. ప్రపంచంలోని మొత్తం 141 నగరాల్లో రియాద్ నగరం 30వ స్థానంలో, మక్కా 52వ స్థానంలో, జెద్దా 56వ స్థానంలో, మదీనా 85వ స్థానంలో నిలిచాయి. అధునాతన సాంకేతికతలను ఉపయోగించడం సౌదీ నగరాల ర్యాంకింగ్ మెరుగవ్వడానికి దోహదం చేసిందని సౌదీ డేటా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అథారిటీ (SDAIA) తెలిపింది. జీవన నాణ్యతను పెంచడంలో జాతీయ వ్యూహాల ప్రభావాన్ని కొలవడానికి ప్రపంచవ్యాప్తంగా IMD సూచీలను ప్రామాణికంగా భావిస్తారు.
తాజా వార్తలు
- తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల GO విడుదల..
- కనకదుర్గ ఆలయానికి నూతన పాలకమండలి..
- తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి నియామకం
- ఇ-కార్ రేసు కేసులో ఇద్దరు ఐఎఎస్ఐ పై ఎసిబి విచారణ
- జైల్లో గ్యాంగ్‌వార్ 17 మంది ఖైదీల మృతి
- రేపటి నుంచి బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు
- గల్ఫ్ లో మొదటి స్థానంలో హమాద్ పోర్ట్..!!
- పాలస్తీనా అథారిటీకి $90 మిలియన్ల సేకరణ..సౌదీ మద్దతు..!!
- దుబాయ్ సివిలిటీ కమిటీని ఏర్పాటు చేసిన షేక్ హమ్దాన్..!!
- కువైట్ లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్..ఇద్దరు అరెస్టు..!!