లెక్కల మాస్టారా మజాకానా.! సుక్కు స్కెచ్ మామూలుగా లేదుగా.!
- April 07, 2023
సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’ సినిమా ఏ రేంజ్లో హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ ట్రెండ్ సెట్టర్‌లా మారిపోయింది ఈ సినిమా. అనూహ్యమైన గుర్తింపు దక్కించుకుంది ప్రపంచ వ్యాప్తంగా ‘పుష్ప’ సినిమా.
ముందుగానే ‘పుష్ప’ సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కించాలనుకున్నారు. ఆ యాంగిల్లోనే మొదటి పార్ట్‌కి లీడ్ వదిలి హైప్ పెంచారు. హైప్‌కి తగ్గట్లుగానే రెండో పార్ట్‌ని భారీగా తెరకెక్కించబోతున్నాడు సుకుమార్.
లేటెస్ట్గా ‘పుష్ప ఎక్కడ.?’ అనే గ్లింప్స్ రిలీజ్ చేసి రెండో పార్ట్‌పై ఆసక్తి పెంచేశారు. ‘బాహుబలి’ మార్కెటింగ్‌లో రాజమౌళి అనుసరించిన ఫార్మేట్‌ని ‘పుష్ప’ సినిమాకి అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది.
కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు.? అనే ప్రచారంతో బాహుబలి రెండో పార్ట్‌ని ప్రమోట్ చేశాడు రాజమౌళి. ఇప్పుడు అదే ఫార్మేట్లో ‘పుష్ప ఎక్కడ.?’ అనే మాటను వదిలి వరల్డ్ వైడ్ ప్రమోషన్లకు తెర లేపాడు సుకుమార్.
ఇప్పుడిదే ట్రెండింగ్. సినిమా రిలీజ్‌కి ఇంకా చాలా చాలా టైముంది. ఈ లోపే స్టార్ట్ చేసిన ఈ సరికొత్త ప్రమోషన్లతో రెండో పుష్ప రాజ్ ఏ రేంజ్లో ట్రెండ్ సృస్టించబోతున్నాడో చూడాలి మరి.
తాజా వార్తలు
- తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల GO విడుదల..
- కనకదుర్గ ఆలయానికి నూతన పాలకమండలి..
- తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి నియామకం
- ఇ-కార్ రేసు కేసులో ఇద్దరు ఐఎఎస్ఐ పై ఎసిబి విచారణ
- జైల్లో గ్యాంగ్‌వార్ 17 మంది ఖైదీల మృతి
- రేపటి నుంచి బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు
- గల్ఫ్ లో మొదటి స్థానంలో హమాద్ పోర్ట్..!!
- పాలస్తీనా అథారిటీకి $90 మిలియన్ల సేకరణ..సౌదీ మద్దతు..!!
- దుబాయ్ సివిలిటీ కమిటీని ఏర్పాటు చేసిన షేక్ హమ్దాన్..!!
- కువైట్ లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్..ఇద్దరు అరెస్టు..!!