‘దసరా’ సీక్వెల్‌పై నాని క్లారిటీ.!
- April 07, 2023
ఒక సినిమా హిట్ అయ్యిందంటే చాలు.. ఆ సినిమాకి సీక్వెల్ అట.. అంటూ ప్రచారం మొదలైపోతోంది. అలాగే, తాజాగా రిలీజై హిట్టు కొట్టిన నేచురల్ స్టార్ నాని సినిమా ‘దసరా’కీ సీక్వెల్ వుండబోతోందట అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
ఎక్కువగా సాగదీయకుండా త్వరలోనే ఈ ప్రచారానికి చెక్ పెట్టేశాడు నాని. ‘దసరా’ సింగిల్ పీస్ సినిమా అనీ, సీక్వెల్ తీసి దీని ఫ్లేవర్ చెడగొట్టడం తనకిష్టం లేదని తేల్చేశాడు.
శ్రీకాంత్ ఓదెలను దర్శకుడిగా పరిచయం చేసిన సినిమా ఇది. కొత్త దర్శకుడే అయినా శ్రీకాంత్‌పై నాని చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఆ నమ్మకాన్ని నిరూపించుకున్నాడు ‘దసరా’ సినిమాతో.
అదే నమ్మకంతో మరో సినిమాకీ మాటిచ్చాడట నాని. ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ మీదికెళుతుందో చూడాలి మరి. ప్రస్తుతం నాని ఓవైపు ‘దసరా’ సక్సెస్ సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేస్తూనే తన కొత్త సినిమా కోసం కూడా సిద్ధమవుతున్నాడు.
తాజా వార్తలు
- తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల GO విడుదల..
- కనకదుర్గ ఆలయానికి నూతన పాలకమండలి..
- తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి నియామకం
- ఇ-కార్ రేసు కేసులో ఇద్దరు ఐఎఎస్ఐ పై ఎసిబి విచారణ
- జైల్లో గ్యాంగ్‌వార్ 17 మంది ఖైదీల మృతి
- రేపటి నుంచి బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు
- గల్ఫ్ లో మొదటి స్థానంలో హమాద్ పోర్ట్..!!
- పాలస్తీనా అథారిటీకి $90 మిలియన్ల సేకరణ..సౌదీ మద్దతు..!!
- దుబాయ్ సివిలిటీ కమిటీని ఏర్పాటు చేసిన షేక్ హమ్దాన్..!!
- కువైట్ లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్..ఇద్దరు అరెస్టు..!!