యాప్‌ మోసాలపై ఒమన్ పోలీస్ హెచ్చరిక

- April 08, 2023 , by Maagulf
యాప్‌ మోసాలపై ఒమన్ పోలీస్ హెచ్చరిక

మస్కట్: IMO ప్లాట్‌ఫారమ్‌లో కొత్త ఎలక్ట్రానిక్ మోసం గురించి రాయల్ ఒమన్ పోలీస్ (ROP) హెచ్చరించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంక్వైరీస్ అండ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్.. IMO అప్లికేషన్‌లో రాయల్ ఒమన్ పోల్స్ లోగోను కలిగి ఉన్న ఫ్రాడ్ ఖాతాను ఉపయోగించి జరుగుతున్న ఒక కొత్త మోసపూరిత కార్యకలాపాన్ని గుర్తించిందని తెలిపింది. ఈ ఖాతా టార్గెటెడ్ యూజర్‌లకు కొన్ని ట్రాఫిక్ జరిమానాలు ఉన్నాయని తెలియజేయడానికి ఉపయోగించారని  పేర్కొంది. అలాంటి బారిన పడి బ్యాంక్ ఖాతా వివరాలను అందించే యూజర్లు ఆర్థికంగా మోసపోయే ప్రమాదం ఉందని ROP తన ప్రకటనలో తెలిపింది. ఆ సమస్యలను అత్యవసరంగా పరిష్కరించాలని సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com