మార్బర్గ్ వైరస్: ఒమన్ వెళ్లే ప్రయాణికులకు ‘ఎమిరేట్స్’ హెచ్చరిక
- April 08, 2023
యూఏఈ: దుబాయ్ ఫ్లాగ్‌షిప్ క్యారియర్ ఎమిరేట్స్.. మార్బర్గ్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఒమన్ సుల్తానేట్ ఆరోగ్యశాఖ నిర్దేశించిన ప్రయాణ మార్గదర్శకాల గురించి ప్రయాణికులకు హెచ్చరికను జారీ చేసింది. మార్బర్గ్ వైరస్ ప్రభావిత దేశాలైన రిపబ్లిక్ ఆఫ్ టాంజానియా, గినియా నుండి ఒమన్‌కు వెళ్లే ప్రయాణికులు క్వారంటైన్ లో ఉండాలని సూచించింది. ప్రయాణం చేసిన 21 రోజులలోపు అనారోగ్యంగా అనిపిస్తే తక్షణ సహాయం తీసుకోవాలని తన అలెర్ట్ లో పేర్కొంది. మరోవైపు ఒమన్ ఆరోగ్య అధికారులు వైరస్ ప్రభావిత దేశాల పర్యటనలను వాయిదా వేసుకోవాలని, ప్రయాణం అత్యవసరమైతే జాగ్రత్తలు తీసుకోవాలని ప్రయాణికులకు సూచించింది. ఇదిలా ఉండగా.. దుబాయ్ - టాంజానియాలోని దార్ ఎస్ సలామ్ నగరాల మధ్య విమానాలు సాధారణ షెడ్యూల్ ప్రకారం పనిచేస్తాయని విమానయాన సంస్థ ఎమిరేట్స్ తెలిపింది. ఇటీవల యూఏఈ కూడా మార్బర్గ్ వైరస్ ప్రభావిత దేశాలకు వెళ్లి వచ్చిన ప్రయాణికులకు ఇలాంటి హెచ్చరికలనే జారీ చేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







