కరివేపాకు కహానీ.! ఇది మీకు తెలసా.?
- April 08, 2023కూరల్లో కరివేపాకు అంటే ఎంత చిన్నతనమో. అడ్డొస్తే, నిర్మొహమాటంగా తీసి పక్కన పడేస్తుంటాం. కానీ, ఆఫ్ట్రాల్ కరివేపాకే అని తీసి పడేస్తే తప్పులో కాలేసినట్లే సుమా. కరివేపాకుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే మరి.
కరివేపాకులో కార్మినేటివ్ గుణం వుంది. ఇది అజీర్తి, కడుపుబ్బరం, గ్యాస్ వంటి సమస్యల్ని దూరం చేస్తుంది. ఉదయం వచ్చే వికారాలూ, నీరసాలని తగ్గించడంలో కరివేపాకు దోహదపడుతుంది.
కరివేపాకులో క్రిమినాశక గుణాలుండడం వల్ల చర్మ గాయాలను నయం చేస్తుంది. అంతేకాదు, కాలిన గాయాలకు కరివేపాకు పేస్ట్‌ని పూతలా పూస్తే తొందరగా గాయం నయం కావడంతో పాటూ, తద్వారా వచ్చే మచ్చల్ని కూడా నియంత్రిస్తుంది.
కరివేపాకులో వుండే కార్బజోల్ ఆల్కలాయిడ్స్ కొలెస్ట్రాల్ ఆక్సీకరణను నిరోధిస్తుంది. దాంతో, చెడు కొలెస్ట్రాల్‌ని కంట్రోల్ చేయడంలో కరివేపాకు మంచి ఔషధంగా పని చేస్తుంది.
బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లతో శక్తివంతంగా పోరాటం చేస్తుంది.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం