7 ఏళ్ల తర్వాత టెహ్రాన్‌కు సౌదీ బృందం..!
- April 09, 2023
టెహ్రాన్ : ఇరాన్‌లో సౌదీ అరేబియా దౌత్య కార్యాలయాలను తిరిగి తెరవడంపై చర్చించడానికి సౌదీ టెక్నికల్ బృందం శనివారం టెహ్రాన్‌కు చేరుకుంది. 2016 తర్వాత సౌదీ ప్రతినిధి బృందం టెహ్రాన్‌కు వెళ్లడం ఇదే తొలిసారి. నివేదిక ప్రకారం.. సౌదీ అరేబియా టెహ్రాన్‌లో తన రాయబార కార్యాలయాన్ని తిరిగి తెరువనుంది. సౌదీ అరేబియా, ఇరాన్, చైనాల ఉమ్మడి త్రైపాక్షిక ఒప్పందాన్ని అమలు చేయడంలో భాగంగా ఇరుదేశాల్లో త్వరలోనే దౌత్య కార్యాలయాలు ప్రారంభం కానున్నాయి.
నాసర్ అల్-ఘనౌమ్ నేతృత్వంలోని సౌదీ సాంకేతిక బృందం, టెహ్రాన్‌లోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ రాయబారి హోనార్డోస్ట్‌తో ప్రోటోకాల్ చీఫ్‌తో సమావేశమైంది. రియాద్, టెహ్రాన్‌లలో తమ రాయబార కార్యాలయాలను.. జెద్దా, మషాద్‌లోని వారి కాన్సులేట్ జనరల్‌లను తెరవడానికి అవసరమైన చర్యలను కొనసాగించడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. అదే విధంగా రెండు దేశాల మధ్య విమానాల పునఃప్రారంభం, ప్రభుత్వ- ప్రైవేట్ రంగ ప్రతినిధుల ద్వైపాక్షిక సందర్శనలు, వీసాల జారీని సులభతరం చేయడంతో సహా రెండు దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించే మార్గాలపై ఇరుదేశాల టెక్నికల్ బృందాలు సమన్వయం, చర్చలు కొనసాగించాలని నిర్ణయించాయి.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







