భాగ్య నగరం చుట్టూ నాలుగు 1000 పడకల ఆసుపత్రులు మంజూరు
- May 08, 2016
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడానికి నగరం చుట్టూ నాలుగు 1000 పడకల ఆసుపత్రులను మంజూరు చేశారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. స్వాతంత్య్రం వచ్చి 60 ఏళ్లు గడుస్తున్నా అందుబాటులో ఉన్నవి గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులేనని, ఉమ్మడి రాష్ట్రంలో ఒక ఆసుపత్రి నిర్మాణానికి నోచుకోలేదని రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌లో ఆదివారం ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రూ.1.62 కోట్ల వ్యయంతో మీర్‌పేట పరిధిలో చేపట్టనున్న మంత్రాల చెరువు సుందరీకరణ పనులకు ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఎంపీ విశ్వేశ్వరరెడ్డిలతో కలిసి మంత్రి ఆదివారం శంకుస్థాపన చేశారు. నిజాం కట్టిన నిమ్స్, గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులే ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్నాయని తెలిపారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా వైద్యసదుపాయాలు మెరుగుపడలేదని అన్నారు. భూగర్భ జలాలు పెరగాలంటే చెరువులో సమృద్ధిగా నీరుండాలని దీంతో నీటి సమస్యలు తలెత్తవన్నారు. చెరువులు కబ్జా కాకుండా వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు పి.నరేందర్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, ఎంపీపీ విక్రమ్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు జె.నరేందర్‌రెడ్డి, కార్పొరేటర్లు అనిత, దయాకర్‌రెడ్డి, పద్మానాయక్, బడంగపేట నగర పంచాయతీ ఛైర్మన్ సామ నరసింహరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల్లో ప్రయాణం ప్రారంభించిన స్పోర్ట్స్ హ్యాకథాన్ టార్చ్
- కీలక మ్యాచ్‌లో విండీస్‌పై భారత్ ఘన విజయం..
- ఖతార్ రక్షణ మంత్రి నుంచి షేక్ హమ్దాన్కు ఫోన్ కాల్
- కువైట్ రక్షణ మంత్రి నుంచి షేఖ్ హమ్దాన్కు ఫోన్ కాల్
- యూఏఈ ప్రైవేట్ రంగానికి అడ్వైజరీ
- అమరావతిలో 'న్యాయ' మణిహారం: రాజధాని ప్రస్థానంలో మరో మైలురాయి!
- ఇరాన్, గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు వారు అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్
- భారీ నిరసనలు..శ్రీనగర్‌లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత
- ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా అలిరెజా అరాఫీ నియామకం
- ఇరాన్ నుంచి ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ









