తల్లిని భుజాలపై ఎక్కించుకొని ఉమ్రా చేయించిన కొడుకు..!
- April 10, 2023
మక్కా: ఉమ్రా చేస్తున్నప్పుడు తన తల్లిని తన భుజాలపై మోసే కొడుకుకు సబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా మంది నెటిజన్లు ఈ వీడియోకు స్పందిస్తూ.. కామెంట్లు చేస్తున్నారు. తల్లి పట్ల అత్యంత శ్రద్ధ వహించే గొప్ప కర్తవ్యాన్ని నిర్వర్తించిన కొడుకుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. పవిత్ర రమదాన్ మాసంలో తల్లికి ఇలా సేవల చేసిన కొడుకు అదృష్టవంతుడు అని కామెంట్స్ పెడుతున్నారు. శుక్రవారం సాయంత్రం పవిత్ర కాబా పరిసరాల్లో తన తల్లిని తన భుజాలపై మోసుకెళ్లేటప్పుడు యాత్రికులు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో.. అది కాస్తా వైరల్ అయింది. సదరు వీడియోలో కొడుకు భుజాలపై కూర్చున్న వృద్ధ మహిళ(తల్లి) ఆనందంతో మునిగిపోవడం, తన ప్రియమైన కొడుకు తలపై ముద్దు పెట్టుకోవడం వీడియోలో కనిపించింది.
తాజా వార్తలు
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు









