‘పుష్ప 2’ ట్విస్ట్ పోలా.! అదిరిపోలా.!

- April 10, 2023 , by Maagulf
‘పుష్ప 2’ ట్విస్ట్ పోలా.! అదిరిపోలా.!

‘పుష్ప’ సినిమాకి ప్యాన్ ఇండియా రేంజ్‌లో ఇమేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో, ముందే ప్రకటించిన ‘పుష్ప 2’ విషయంలో డైరెక్టర్ సుకుమార్ కొన్ని కీలకమైన మార్పులు చేయాల్సి వచ్చింది.

ఆ నేపథ్యంలోనే కథలో జరిగిన కీలక మార్పుల ప్రకారం ‘పుష్ప 2’లో అల్లు అర్జున్ డబుల్ రోల్ అనే సరికొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. 

‘పోకిరి’ నేపథ్యంలో ఓ షాకింగ్ ట్విస్ట్ వుండబోతోందట. అండర్ కవర్ ఆఫీసర్ పాత్రలో బన్నీ కనిపించబోతున్నాడట. ఇప్పటికే ‘వేర్ ఈజ్ పుష్ప’ అంటూ రిలీజ్ చేసిన వీడియో సెన్సేషనల్ అవుతోంది.

ఇక, తాజాగా చక్కర్లు కొడుతున్న గాసిప్‌తో ‘పుష్ప 2’ అంచనాలు ఆకాశాన్నంటేస్తున్నాయ్. నిజంగానే సుక్కు మాస్టర్ బన్నీని డబుల్ రోల్‌లో చూపించబోతున్నారా.? లెట్స్ వెయిట్ అండ్ సీ.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com