పవన్ కళ్యాణ్ ఇంకోటి.! అబ్బే.! తగ్గేదేలే.!

- April 10, 2023 , by Maagulf
పవన్ కళ్యాణ్ ఇంకోటి.! అబ్బే.! తగ్గేదేలే.!

ఇటీవల మాస్ రాజా రవితేజతో ‘రావణాసుర’ సినిమా తెరకెక్కించిన సుధీర్ వర్మ, పవన్ కళ్యాణ్‌తో ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. 

త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ స్టోరీ లైన్ చెప్పారట. దాన్ని డెవలప్ చేసే బాధ్యత సుధీర్ వర్మకు అప్పగించినట్లు టాక్ వినిపిస్తోంది. మాటలు, స్క్రీన్‌ప్లే మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్‌దేనట. 
కథ మాత్రం సుధీర్ వర్మ సిద్ధం చేయనున్నారట. ఇందులో నిజమెంతో తెలీదు కానీ, ఇప్పటికే పవన్ కళ్యాణ్ చేతిలో నాలుగు ప్రాజెక్టులున్నాయ్.

అందులో ‘వినోదయసితమ్’ పూర్తయిపోయింది. హరీష్ శంకర్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఇటీవలే సెట్స్ మీదికి వెళ్లింది. వచ్చే నెల్లో సుజిత్ ‘ఓజీ’ రెగ్యులర్ షూట్ స్టార్ట్ కానుంది. 
ఈ లోపు సుధీర్ వర్మ ప్రాజెక్టు.. నిజంగానే ఈ ప్రాజెక్టుకు పవన్ కళ్యాణ్ సై అన్నారా.? పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com