‘శాకుంతలం’.! రాజుగారి హంగామా మామూలుగా లేదుగా.!
- April 11, 2023
దిల్ రాజుకు ఈ మధ్య పెద్దగా కలిసి రావడం లేదు. బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ.. అన్న చందంగా మారింది రాజుగారి బిజినెస్. సంక్రాంతికి ‘వారసుడు’ సినిమాతో గట్టి దెబ్బే తినేశాడు దిల్ రాజు.
ఆ తర్వాత చిన్న సినిమా ‘బలగం’ తో ఎలాగోలా కాస్త తేరుకున్నట్లు కనిపించాడు.
ఇప్పుడు ‘శాకుంతలం’ ప్రాజెక్ట్‌ని టేకప్ చేశాడు. నిజానికి ఈ సినిమాకి నిర్మాత గుణ శేఖరే అయినా, దిల్ రాజు కూడా ఆ బాధ్యతలో భాగం అయ్యారు.
రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ‘శాకుంతలం’కు అంతా తానే అన్నట్లుగా పబ్లిసిటీ స్టంట్స్ మొదలెట్టారు. అందులో భాగంగానే ఈ సినిమాని ఓ రేంజ్లో ప్రమోట్ చేస్తున్నారు దిల్ రాజు.
రాజుగారు ఆశించినట్లే ‘శాకుంతలం’ హిట్ అయితే, రాజుగారికి బాగానే ముడుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ శుక్రవారం అనగా ఏప్రిల్ 14న ‘శాకుంతలం’ రిలీజ్ కానుంది. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు బాగానే వున్నాయ్. కానీ, చూడాలి మరి ఆడియన్స్ రిపోర్ట్ ఎలా వుండబోతోందో.!
తాజా వార్తలు
- ఆహార భద్రతా వ్యవస్థను సమీక్షించిన మినిస్టర్ టీమ్..!!
- అల్ సహ్లా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రవాసులు మృతి..!!
- ఫేక్ బ్రాండెడ్ గూడ్స్..మనీలాండరింగ్.. Dh1-మిలియన్ ఫైన్, ఏడాది జైలు..!!
- భద్రతా పరమైన సంఘటనల వీడియోలు తీయవద్దు..!!
- సయ్యద్ ఫహద్ మరణం పై పలు దేశాలు సంతాపం..!!
- మదీనాలో చిన్నారిని చంపిన ఫిలిప్పీన్స్ వర్కర్ అరెస్ట్..!!
- 45 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్‌లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం









