‘ఓజీ’ కోసం ‘ధమాకా’ బ్యూటీ కాదు, ‘మాస్టర్’ భామ ఫైనల్.!

- April 11, 2023 , by Maagulf
‘ఓజీ’ కోసం ‘ధమాకా’ బ్యూటీ కాదు, ‘మాస్టర్’ భామ ఫైనల్.!

పవన్ కళ్యాణ్ - సుజిత్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న మూవీలో ‘ధమాకా’ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ అంటూ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. 

అయితే, తాజాగా ఆ ప్లేస్‌ని ‘మాస్టర్’ బ్యూటీ మాళవిక మోహనన్ కొట్టేసినట్లు తెలుస్తోంది. శ్రీలీల మరీ క్యూట్‌గా కనిపించడంతో పవన్ పక్కన సరిపోకపోవచ్చనీ అంటున్నారు. 
‘ధమాకా’లోనూ ఎలాగోలా నెట్టుకొచ్చేసింది కానీ, అమ్మడి చబ్బీ లుక్స్ సీనియర్ హీరోల పక్కన సెట్ అయ్యేవి కావనీ కొందరు అభిప్రాయపడుతున్నారు. 

దాంతో, పవన్ ‘ఓజీ’ కోసం మాళవిక మోహనన్‌ని తీసుకున్నారనీ తెలుస్తోంది. దాదాపు మాళవిక ఈ సినిమాలో ఫిక్స్ అయిపోయినట్లే తెలుస్తోంది. ఇంతవరకూ తమిళ డబ్బింగ్ సినిమాలు ‘మాస్టర్’, ‘మారి’ తదితర చిత్రాలతో పాపులర్ అయిన మాళవిక ప్రస్తుతం ప్రబాస్ సినిమాలో నటిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com