అధికారులు గరిష్ట శిక్షా రేటును సాధించడమే లక్ష్యంగా పని చేయాలి: సీపీ చౌహాన్
- April 11, 2023
హైదరాబాద్: రాచకొండ కమిషనరేట్ పరిధిలో నేర పరిశోధన మరియు నేర నిరూపణ ద్వారా 2023 జనవరి నెల నుండి మార్చి నెలల కాలానికి గాను గరిష్ట శిక్షా రేటు మరియు మంచి ఫలితాలు సాధించిన అధికారులు మరియు ఇతర సిబ్బందికి రివార్డ్ మేళా నిర్వహించడం జరిగింది.
తార్నాకలోని ఐఐసిటి సంస్థలో నిర్వహించిన రాచకొండ పోలిస్ రివార్డ్ మేళా కార్యక్రమంలో రాచకొండ కమిషనర్ డి.ఎస్ చౌహాన్ మాట్లాడుతూ నేర పరిశోధన మరియు దర్యాప్తులో పాల్గొనే అన్ని స్థాయిల సిబ్బంది మరియు అధికారులు నేరస్తులకు శిక్ష పడే ఒకే లక్ష్యంతో పనిచేయాలని సూచించారు.సామాన్య ప్రజల పట్ల నేరాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచి పెట్టమని, నేరం ఎవరు చేసినా నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి చట్ట ప్రకారం శిక్షలు పడేలా పనిచేస్తామని కమిషనర్ తెలిపారు.
శిక్షా రేటును పెంచే లక్ష్యంతో రాచకొండ కమీషనరేట్ పరిదిలో కేసుల దర్యాప్తు సమయంలో పాటించవలసిన విధానాలు మరియు తీసుకోవలసిన జాగ్రత్తలను తెలుపుతూ క్రిమినల్ జస్టిస్ సిస్టంలోని అందరూ సమన్వయంతో పనిచేస్తే నేరస్తునికి తగిన శిక్ష పడుతుందన్నారు.అదే విదంగా పోలీసులు, ప్రోసిక్యూటర్స్ కలసి కేసుకు సంబందించిన విషయాలను చర్చించి నేరస్తులకు తగిన శిక్ష పడే విధంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్రంలో గరిష్ట శిక్షా రేటులో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు అందరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లను మరియు కోర్టు డ్యూటి ఆఫీసర్ ల కృషిని అభినందించారు. అదే విదంగా NDPS కేసులలో కూడా SOP మరియు చెక్ లిస్ట్ లను అనుసరిస్తూ నేరస్తులకు తగిన శిక్ష పడే విదంగా చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో జాయింట్ కమీషనర్ V.సత్యనారాయణ తో పాటు రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లోని నాలుగు జోనల్ డి.సి.పి లు, క్రైమ్ డి.సి.పి, ఏ.సి.పి.సి.సి.ఆర్.బి,ఇన్వెస్టిగేషన్ అధికారులు, సి.డి.ఓ లు మరియు ప్రాసిక్యూషన్ తరపున డిప్యూటీ డైరెక్టర్ కస్తూరి,జాయింట్ డైరెక్టర్ రాజి రెడ్డి, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పాల్గొన్నారు.

తాజా వార్తలు
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!







