ఈద్ అల్ ఫితర్ కానుక.. చంద్రునిపై దిగనున్న రషీద్ రోవర్..!

- April 12, 2023 , by Maagulf
ఈద్ అల్ ఫితర్ కానుక.. చంద్రునిపై దిగనున్న రషీద్ రోవర్..!

యూఏఈ: ఈద్ అల్ ఫితర్ నాలుగు రోజుల సెలవుదినం తర్వాత యూఏఈ రషీద్ రోవర్ చంద్రునిపై ల్యాండింగ్ కానుంది. ఏప్రిల్ 25ను (మంగళవారం) HAKUTO-R మిషన్ 1 లూనార్ ల్యాండర్ కోసం షెడ్యూల్ చేశారు. జపాన్‌కు చెందిన ispace ల్యాండింగ్‌ను సాయంత్రం 4.40 గంటలకు (UTC) ప్రారంభం అయ్యే అవకాశం ఉందని ప్రకటించింది. యూఏఈ సమయం రాత్రి 8.40 గంటలకు ఆ ఆపరేషన్ జరుగనుంది. ప్రస్తుతం మిషన్ 1 ల్యాండర్ 100km -2,300km మధ్య ఎత్తులో దీర్ఘవృత్తాకార కక్ష్యలో చంద్రుని చుట్టూ తిరుగుతోంది. "ఏప్రిల్ 25న మధ్యాహ్నం 3.40 గంటలకు (యూఏఈలో సాయంత్రం 7.40) ల్యాండర్ 100km ఎత్తు కక్ష్య నుండి ల్యాండింగ్ సీక్వెన్స్‌ను ప్రారంభిస్తుంది. ఈ క్రమంలో కక్ష్య నుండి వేగాన్ని తగ్గించుకుంటూ.. ల్యాండర్ చంద్రుని ఉపరితలంపై ల్యాండింగ్ అవుతుంది. ఈ మొత్తం ప్రక్రియకు దాదాపు ఒక గంట సమయం పడుతుంది." అని ఇస్పేస్ తన ప్రకటనలో వెల్లడించింది. కాగా, ఏప్రిల్ 25న ల్యాండింగ్ ప్రక్రియ సాధ్యం కాకపోతే.. ప్రత్యామ్నాయంగా  వాతావరణ పరిస్థితులను బట్టి ఏప్రిల్ 26, మే 1, మే 3వ తేదేల్లో రోవర్ ల్యాండింగ్ ప్రక్రియను చేపడతారు. ఇదిలా ఉండగా.. ల్యాండర్ గత నెలలో చంద్ర కక్ష్యలోకి ప్రవేశించింది. అక్కడినుంచి ల్యాండర్ ఆన్‌బోర్డ్ కెమెరా ద్వారా చంద్రుని చిత్రాలను ఫోటో తీసి  పంపింది. దుబాయ్ మాజీ పాలకుడు దివంగత షేక్ రషీద్ బిన్ సయీద్ అల్ మక్తూమ్ పేరు మీద యూఏఈ రషీద్ రోవర్ ను నిర్మించింది. ఇది అరబ్ దేశం నిర్మించిన మొదటి మూన్ ప్రాజెక్ట్ కావడం గమనార్హం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com