రవాణా శాఖ సిస్టమ్‌ హ్యాక్.. ఆసియా ప్రోగ్రామర్ కు జరిమానా

- April 12, 2023 , by Maagulf
రవాణా శాఖ సిస్టమ్‌ హ్యాక్..  ఆసియా ప్రోగ్రామర్ కు జరిమానా

దుబాయ్: 36 ఏళ్ల ఆసియా ప్రోగ్రామర్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ కార్డ్‌లకు క్రెడిట్‌లను రీఛార్జి చేసే సిస్టమ్‌ను హ్యాక్ చేశాడు. మొత్తం Dh107,000 విలువైన 81 కార్డ్‌లను అక్రమంగా రీఛార్జ్ చేశాడు. దుబాయ్ మిస్‌డిమినర్ కోర్టు నిందితుడిని దోషిగా నిర్ధారించి..  91,000 దిర్హామ్‌ల జరిమానా విధించింది. పోలీసు రికార్డుల ప్రకారం, దుబాయ్‌లోని పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీలోని ఆటోమేటిక్ కలెక్షన్ సిస్టమ్స్ సూపర్‌వైజర్.. రవాణా కార్డుల మధ్య నగదు బదిలీ వ్యవస్థలో జరుగుతున్న అనుమానాస్పద లావాదేవీలను గుర్తించాడు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు తెలుపగా.. ఒక గుర్తుతెలియని వ్యక్తి (“నిందితుడు”) సిస్టమ్‌ను హ్యాక్ చేసి, రీఛార్జ్ చేయడానికి.. కార్డ్‌ల మధ్య మొత్తాలను బదిలీ చేయడానికి 81 కార్డ్‌లను ఉపయోగించినట్లు వారు గుర్తించారు. నిందితుడు ఎమిరాటీ గుర్తింపుతో నమోదు చేసుకున్న అకౌంట్ ద్వారా హ్యాక్ చేసినట్లు.. నిందితుడు ఆసియా ప్రోగ్రామర్ గా అధికారులు తెలుసుకున్నారు. అనంతరం ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. కేసు ఫైల్ ప్రకారం..  నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. అతను స్మార్ట్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్‌లోని బగ్(లొసుగు) ద్వారా సిస్టమ్‌ను హ్యాక్ చేసినట్లు తలిపారు. కోర్టు ప్రోగ్రామర్ ని  దోషిగా నిర్ధారించి తీర్పు వెలువరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com