తాటి ముంజలు తింటే ఉష్ణతాపానికి చెక్ పెట్టవచ్చు
- May 08, 2016
వేసవి వచ్చిందంటే తాటి ముంజలు కోసం అందరూ ఎదురుచూస్తూంటారు. ఎండాకాలంలో మాత్రమే లభించే తాటి ముంజలు తింటే ఉష్ణతాపానికి చెక్ పెట్టవచ్చు. ఆరు అరటిపండ్లలో ఉండే పొటాషియం ఒక్క తాటి ముంజలో ఉంటుంది. బి.పిని అదుపులో ఉంచి కోలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. కల్తీ లేకుండా ఉండే తాటిముంజలు ఇష్టపడనివారు ఎవరూ ఉండరు. సహజ సిద్ధమైన ముంజలు ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని వైద్య నిఫుణులు చెబుతున్నారు. ఎముకలను బలంగా ఉంచడమే గాక వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందని అంటున్నారు. శరీరం కూడా చల్లగా , హాయిగా ఉంటుందని పేర్కొంటు న్నారు. తాటి ముంజను తొలవగానే మధ్యలో కొంత నీరు ఉంటుంది. ఆ నీరు మాత్రం నోరూరించే రుచిగా ఉంటుంది. ఆ నీటితో మనిషి శరీరంలోని ఉష్ణోగ్రత తగ్గి జీర్ణక్రియ బాగా జరుగుతుంది. ముఖ్యంగా చిన్న పిల్లలకి ముసలి వాళ్లకి చాలా మంచిది. వీటిలో అధికంగా తేమ, తక్కువ కొవ్వు పదార్థాలు కలిగి చిన్నారులకు, హుద్రోగులకు, షుగర్ వ్యాధి గ్రస్తులకు, స్థూల కాయులకు ఎంతాగానో ఉపయోగపడుతుంది. ఆరోగ్యానికి దోహదం చేయడంతో పాటు దాహార్తికి కూడా మంచి విరుగుడు. ముంజల్లో ఎక్కువ మొత్తంలో శరీరానికి కావాల్సిన శక్తి ఉంటుంది. కొంతమందికి ఎండాకాలంలో వేడికి ముఖంపై మొటిమలు వస్తుంటాయి. వీటి నుంచి ఉపశమనం పొందాలంటే ముంజలను తినడం మంచిది. తాటి ముంజులలో శరీరానికి కావాల్సిన ఏ, బీ , సీ విటమిన్లు ఐరన్, జింక్, పాస్ఫరస్, పొటాషియం వంటి పోషకాలు అందుతాయి. శరీర బరువును తగ్గించడంలో కూడా ముంజలు తోడ్పడతాయి. వాటిలో అధికంగా నీరు ఉండడం వల్ల బరువు తగ్గే అవకాశాలు ఎక్కువ. తాటి ముంజలతో కాలేయ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. వీటిలో ఉండే పొటాషియం శరీరంలో ఉండే విష పదార్ధాలను తొలగించడంలో దోహదపడతాయి. వేసవిలో సహజ సిద్ధంగా వచ్చే అలసట, నీరసం ముంజలు తినడం వల్ల తగ్గుతాయి. వేసవిలో ఎండలు కారణంగా కొంత మందికి విరేచనాలు, వాంతులు అయ్యే పరిస్థితి ఉంటుంది. వాటికి నిమ్మరసం ఇస్తారు. ఆ సమయంలో ముంజలు తినడం వల్ల శారీరక ఉపశమనం పొందవచ్చు. కేన్సర్ కణాల నిరోధానికి ముంజలు ఉపయోగపడతాయి. కల్లు విక్రయాలు తగ్గిపోవడంతో గీత కార్మికులు ఆర్థికంగా ఇబ్బందిపడుతున్నారు. ఈ ముంజలను విక్రయించడం ద్వారా ఎంతో కొంత ఆదాయం వస్తోంది.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







