ఓట్స్ తో ఆవడ
- May 08, 2016
కావలసిన పదార్థాలు: ఓట్స్- 2 టేబుల్ స్పూన్లు, పెసరపప్పు- 1/4 కప్పు, మినప్పప్పు- 1/4 కప్పు, బేకింగ్ పౌడర్- 1/4 టీ స్పూను, నూనె- వేగించడానికి సరిపడా, ఉప్పు- రుచికి సరిపడా, పెరుగు- 2 కప్పులు, కారం- 1/4 టీ స్పూను, అల్లం తరుగు- 1/4 టీ స్పూను, ఉల్లిపాయలు- 2, పచ్చిమిర్చి- 2, కరివేపాకు- 1 రెబ్బ, తాలింపు దినుసులు- 1 టీ స్పూను.
తయారీ విధానం: పెసరపప్పు, మినపప్పులను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే పావుకప్పు నీళ్ళు పోసి రుబ్బుకోవాలి. తరువాత ఓట్స్‌ను దోరగా వేగించి పొడిచేసి రుబ్బిపెట్టుకున్న పిండిలో కలిపి, బేకింగ్ పౌడర్, ఉప్పు కూడా వేసి అరగంట నానబెట్టాలి. పెరుగులో ఉప్పు, కారం, అల్లం, ఉల్లి, పచ్చిమిర్చిల తరుగు కలిపి, పోపు పెట్టి పక్కన ఉంచాలి. ఆ తరువాత గుంట పొంగడాల పెనం గుంటలకు నూనె రాసి, వాటిలో పిండి నింపి రెండు వైపులా వేగించి పెరుగు మిశ్రమంలో వేయాలి.
తాజా వార్తలు
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత







