బహ్రెయిన్ లో తెలుగు కార్మిక సోదరుల కష్టాలు
- June 21, 2015
పొట్ట చేత పట్టుకుని దేశం కాని దేశానికి వెళ్లిన తెలుగు రాష్ట్రాల వారిని అక్క డి కంపెనీ యాజమాన్యాలు వంచిస్తున్నాయి. ఏజెంట్ల మోసానికి కంపెనీ యాజమాన్యం వంచన కూడా తోడు కావడంతో తెలుగు కార్మికులకుది దిక్కుతోచని పరిస్థితి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్టాలల్లోని నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, కడప, చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన సుమారు 126 మంది కార్మికులు నాలుగు నెలల క్రితం ఉపాధి కోసం బహ్రెయిన్ వెళ్లారు. అక్కడి కన్స్ట్రక్షన్ కంపెనీలైన అట్లాస్, టీఎంఎస్లలో పనికి కుదిరారు. హైదరాబాద్‌కు చెందిన రావు అలియాస్ రెడ్డి, నిజామాబాద్‌కు చెందిన శేఖర్ అనే ఏజెంట్ల ద్వారా వీరు బహ్రెయిన్‌కు వెళ్లారు. ఒక్కో కార్మికుడు వీసా కోసం రూ. 65 వేల నుంచి రూ. 1.20 లక్షల వరకు చెల్లించారు. రోజు ఎనిమిది గంటల పాటు డ్యూటీ, ఇండియన్ కరెన్సీలో నెలకు రూ.20 వేల వరకు వేతనం చెల్లించడానికి కంపెనీ యాజమాన్యం కార్మికులతో ఒప్పందం కుదుర్చుకుంది.కార్మికులకు ఉచిత వసతి, భోజన సదుపాయాలను కల్పిస్తున్నట్లు ఒప్పందంలో పేర్కొన్నారు. కార్మికులకు మూడు నెలల వేతనాన్ని యాజమాన్యాలు చెల్లించాల్సి ఉంది. భారత రాయబార కార్యాలయంలో ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేదని కార్మికులు తెలిపారు. ఇటీవల బహ్రెయిన్‌లో పర్యటించిన నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితకు తాము ఫిర్యాదు చేసినట్లు కార్మికులు తెలిపారు. ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కార్మికులు వివరించారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







