జయంరవి నూతన చిత్రంగా తనీఒరవన్-2
- May 08, 2016
జయంరవి 25వ చిత్రంగా తనీఒరవన్-2 ఉంటుందని ఆయన సహోదరుడు, దర్శకుడు మోహన్‌రాజా వెల్లడించారు.ఆయనపై రీమేక్ చిత్రాల దర్శకుడన్న ముద్రను తుడిచేసిన చిత్రం తనీఒరువన్. జయంరవి కథానాయకుడిగా నయనతార నాయకిగా గత ఏడాది తెరపైకి వచ్చిన సంచలన చిత్రం తనీఒరువన్ .జయంరవి చిత్రాల్లోనే పెద్ద హిట్‌గా నిలిచిన ఈ చిత్రం పలు కోలీవుడ్‌లో ఒక సంచలన చిత్రంగా నమోదైంది.ప్రస్తుతం పలు భాషల్లో రీమేక్‌కు రెడీ అవుతున్న తనీఒరువన్ తాజాగా తెలుగులో రామ్‌చరణ్ హీరోగా పునర్నిర్మాణం కానుంది.ఇటీవలే దివంగత ప్రఖ్యాత నిర్మాత నాగిరెడ్డి అవార్డును గెలుచుకున్న ఈ చిత్రం అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడుతోంది. సీక్వెల్ ట్రెండ్ నడుస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి విజయవంతమైన చిత్రానికి రెండో భాగం ఉంటుందన్న ప్రశ్న చాలా మందిలో నెలకొంది. దానికి ఆ చిత్ర దర్శకుడు మోహన్‌రాజా ఇటీవల బదులిస్తూ జయంరవి 25వ చిత్రంగా తనీఒరువన్-2 ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ఆయన శివకార్తికేయన్ హీరోగా చిత్రం తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. ఇక జయంరవి భోగన్ చిత్రం పూర్తి చేసి మిరుదన్కు సీక్వెల్ చేయనున్నారు. దీంతో తనీఒరువన్-2 రూపొందడానికి ఇంకా చాలా సమయం ఉంటుందన్నది తెలుస్తోంది.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







