రమదాన్ 2023: 76 ఆహార సంస్థలకు జరిమానా

- April 15, 2023 , by Maagulf
రమదాన్ 2023: 76 ఆహార సంస్థలకు జరిమానా

యూఏఈ: రమదాన్ సందర్భంగా వివిధ ఉల్లంఘనలకు సంబంధించి మొత్తం 76 ఆహార సంస్థలకు జరిమానా విధించినట్లు అబుధాబి అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ (ADAFSA) వెల్లడించింది. ఆహార భద్రతను ప్రోత్సహించడానికి , ఆహార వ్యర్థాలను తగ్గించడానికి నిర్వహించిన ప్రచారం సందర్భంగా మొత్తం 4,491 సంస్థలను తనిఖీ చేసినట్లు అధికార యంత్రాంగం తెలిపింది. పవిత్ర మాసానికి ఒక వారం ముందు ప్రారంభమైన ప్రచారం, ఆహార భద్రతా నిబంధనలు, చట్టాన్ని అమలు చేయడం, సమాజ ఆరోగ్యాన్ని పరిరక్షించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది.  2,531 ఆహార సంస్థలు నిబంధనల మేరకు ఉన్నాయని,  నియమాలు పాటించని 1,628 సంస్థలకు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపింది. సూపర్ మార్కెట్లు, రెస్టారెంట్లు, పంపిణీ కేంద్రాలు, ఆహార దుకాణాలు, క్యాటరింగ్ కంపెనీలు, మాంసం, చేపలు, కూరగాయలు, పండ్లను విక్రయించే మార్కెట్‌లతో సహా ఆహార గొలుసులో పాల్గొన్న అన్ని సంస్థలలో తనిఖీ ప్రచారాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు . ADAFSA అబుధాబి ప్రభుత్వం కోసం టోల్-ఫ్రీ నంబర్ 800555కి కాల్ చేయడం ద్వారా ఏదైనా ఆహార సంస్థలో ఏవైనా ఉల్లంఘనలు గుర్తిస్తే.. నివేదించాలని ప్రజలను కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com