గ్రేట్ ఆన్‌లైన్ సేల్: 95శాతం వరకు తగ్గింపు..!
- April 15, 2023
యూఏఈ: మొట్టమొదటిసారిగా యూఏఈ దుకాణదారులు ఇష్టమైన బ్రాండ్‌లపై 95 శాతం వరకు తగ్గింపును అందించే ప్రత్యేక విక్రయాన్ని అందిస్తున్నారు. ఏప్రిల్ 14న అర్ధరాత్రి 12.01 గంటలకు ప్రారంభమైన ఈ సేల్ ఏప్రిల్ 16న రాత్రి 11.59 గంటల వరకు.. ది గ్రేట్ ఆన్‌లైన్ సేల్ (TGOS) మూడు రోజుల పాటు కొనసాగుతుంది. దుబాయ్ ఫెస్టివల్స్, రిటైల్ ఎస్టాబ్లిష్‌మెంట్ (DFRE) హోస్ట్ చేసిన ఈ మెగా ఈవెంట్‌లో ప్రముఖ బాండ్లతోపాటు అనేక రకాల వస్తువులపై 30 నుండి 95 శాతం తగ్గింపును అందిస్తోంది. www.greatonlinesale.comలో ది గ్రేట్ ఆన్ లైన్ సేల్ నడుస్తోంది. "ఇది కొనుగోలుదారులకు సరికొత్త వినియోగదారు అనుభవాన్ని అందిస్తుంది. ఇది ఒకే ప్లాట్‌ఫారమ్‌లో అద్భుతమైన డిస్కౌంట్‌లు, ఆఫర్‌లను అందిస్తుంది. అయితే ఎక్కడి నుండైనా, ఎప్పుడైనా అందుబాటులో ఉంటుంది." అని DFRE వద్ద రిటైల్ రిజిస్ట్రేషన్ డైరెక్టర్ మహమ్మద్ ఫెరాస్ అరేకత్ చెప్పారు. అలాగే ముగ్గురు అదృష్ట విజేతలకు Dh10,000 నగదును అందజేయనున్నట్లు మహమ్మద్ చెప్పారు.
తాజా వార్తలు
- జనవరి 2 నుంచి విజయవాడలో బుక్ ఫెస్టివల్
- అక్టోబర్ లో ఇంపోర్ట్స్ లో బహ్రెయిన్ రికార్డు..!!
- దాడిని ఖండించిన ఎనిమిది అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- యూఏఈ అస్థిర వాతావరణం..భారీ వర్షాలు..!!
- భారత్ ఆర్కియాలజీ గ్యాలరీలో కువైట్ వస్తువులు..!!
- కస్టమ్స్ పోర్టులలో 1,145 అక్రమ వస్తువులు సీజ్..!!
- కీలక ఖనిజాల అన్వేషణ కోసం ఒమన్ రోడ్ మ్యాప్..!!
- రాచకొండ పోలీసులను అభినందించిన డిజిపి బి.శివధర్ రెడ్డి
- ఏపీ: లోక్ అదాలత్ 2 లక్షల కేసుల పరిష్కారం
- పెమ్మసానికి కీలక బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు







