విమానంలో ప్రయాణీకుల అనుచిత ప్రవర్తన..యూఏఈ కొత్త నిబంధనలు
- April 16, 2023
యూఏఈ: మాంట్రియల్ ప్రోటోకాల్ 2014 (MP14)ను ఆమోదించడానికి యూఏఈ తీసుకున్న చర్యను ఎయిర్‌లైన్ పరిశ్రమలోని సంస్థలు స్వాగతించాయి. ఈ చర్య విమానాలలో అనుచిత, అంతరాయం కలిగించే ప్రయాణీకుల సంఘటనలకు వ్యతిరేకంగా ప్రపంచ చట్టపరమైన ప్రతిబంధకాన్ని బలోపేతం చేస్తుందన్నారు. కొత్త చట్టం 2023మే 1 నుండి అమలులోకి వస్తుంది. విమానం ఎక్కడ రిజిస్టర్ చేయబడిందనే దానితో సంబంధం లేకుండా దేశంలో దిగిన అనుచిత, అంతరాయం కలిగించే ప్రయాణీకులను అదుపులోకి తీసుకునేందుకు యూఏఈలోని అధికారులు అధికారాన్ని కలిగి ఉంటారు. ఇది అంతర్జాతీయ విమానయాన చట్టంలో ఇప్పటికే ఉన్న గ్యాప్‌ను పరిష్కరిస్తుందని విమానయాన సంస్థలు చెబుతున్నాయి. విమాన ప్రయాణంలో అంతరాయం కలిగించే ఫ్లైయర్లపై కఠినమైన జరిమానాల అమలును సులభతరం చేస్తుందని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (IATA) పేర్కొంది. MP14ను ఆమోదించిన 44వ రాష్ట్రంగా యూఏఈ నిలిచింది.
తాజా వార్తలు
- ఈసారి మాములుగా ఉండదంటూ కార్యకర్తల్లో జోష్ నింపిన జగన్
- ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం
- అరబ్-భారత సహకార వేదిక ఉజ్వల భవిష్యత్తుకు వారధి..!!
- ఖతార్, భారత్ మధ్య పెట్టుబడి అవకాశాలపై చర్చలు..!!
- షార్జాలో సినిమా ఫక్కీలో కారు చోరీ.. దొంగ అరెస్ట్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ కెమెరా వ్యవస్థ మొదటి దశ ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో ఫాగ్, రెయిన్స్ హెచ్చరికలు జారీ..!!
- అంతరిక్ష రంగంలో మరిన్ని పెట్టుబడులకు ఒమన్ పిలుపు..!!
- పిల్లల ఇంటర్నెట్ వాడకం పై కఠిన నిబంధనలు..
- తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు







