సల్మాన్ సిటీ ప్రాజెక్టులను పరిశీలించిన గృహనిర్మాణ శాఖ మంత్రి
- April 17, 2023
బహ్రెయిన్: సల్మాన్ సిటీని సిటీ హౌసింగ్‌లో ప్రాజెక్ట్‌లను బహ్రెయిన్ హౌసింగ్ అండ్ అర్బన్ ప్లానింగ్ మినిస్టర్ అమీనా బింట్ అహ్మద్ అల్ రొమైహి పరిశీలించారు. ప్రాజెక్ట్ ను వేగవంతం చేయాలని ఈ సందర్భంగా సూచించారు. అపార్ట్మెంట్ల డెలివరీని వేగవంతం చేసే లక్ష్యంతో సల్మాన్ సిటీలోని ప్రాజెక్ట్‌లు తుది దశకు చేరాయని అల్ రోమైహి తెలిపారు. సల్మాన్ సిటీ ప్రస్తుతం 303 హౌసింగ్ యూనిట్లు, 1,300 కంటే ఎక్కువ యాజమాన్య అపార్ట్మెంట్లు ఉన్నాయని వివరించారు. ప్రాజెక్టుల్లో భాగంగా 9 మస్జీదులు, 4 కిండర్ గార్టెన్లు, 3 పాఠశాలలు, సెంట్రల్ పార్క్, సివిల్ డిఫెన్స్, పోలీస్ స్టేషన్, హెల్త్ సెంటర్, కమ్యూనికేషన్ టవర్లు, కోస్ట్ గార్డ్ పాయింట్లు, టవర్ల నిర్మాణాన్ని పరిశీలించారు. సల్మాన్ సిటీతోపాటు తూర్పు సిత్రా, ఈస్ట్ హిద్, ఖలీఫా సిటీ వంటి ఇతర గృహ నగరాల్లోని ప్రాజెక్టులు తుది దశకు చేరాయని అల్ రోమైహి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి కొత్త రూల్స్!
- ఏపీలో కొత్తగా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం..
- భారత్ ఘన విజయం
- అయోధ్య రామాలయం పనులు ముగింపు దశలో, ఏప్రిల్ 30కి ఏమిటి?
- 2026: అట్టహాసంగా ముగిసిన వింగ్స్ ఇండియా 2026
- అజ్మాన్ 'అబ్రా'కు పెరిగిన క్రేజ్
- రేపు సిట్ ముందుకు కేసీఆర్..
- యూఏఈ సరికొత్త చట్టం
- ఇజ్రాయెల్‌తో ట్రంప్ రాజీ..
- చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్







