దుబాయ్ అగ్నిప్రమాదం: పలువురిని కాపాడిన భారతీయ కార్మికులకు నివాళులు
- April 17, 2023
యూఏఈ: దుబాయ్ భవన అగ్నిప్రమాదం జరిగిన సమయంలో పలువురిని కాపాడిన భారతీయ కార్మికులకు ఆ భవనం నుంచి బయటపడ్డ అద్దెదారులు నివాళులర్పించారు. ఏప్రిల్ 15 మధ్యాహ్నం దీరాలోని దురదృష్టకర ఘటనలో భవన నిర్మాణ కార్మికులైన సలియకోండు గూడు, ఇమామ్ కాసిం మరణించారు. వారు సురక్షితంగా బయటపడే అవకాశం ఉన్నా.. భవనంలోని అద్దెదారులను కాపాడేందుకు వారు ప్రాధాన్యత ఇచ్చారు. వీరి కారణంగా అగ్ని ప్రమాదం నుంచి బయటపడ్డ పలువురు ఈ సందర్భంగా భారతీయ కార్మికుల త్యాగాలను స్మరించుకున్నారు. వారు వచ్చి తలుపుతట్టి విషయం చెప్పడంతోనే తన ప్రాణాలు మూడవ అంతస్తులో నివసిస్తున్న పాకిస్తాన్ ప్రవాస ముదస్సిర్ అహ్మద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఇద్దరు భారతీయ కార్మికులు మంటలను ఆర్పడానికి గ్రౌండ్ ఫ్లోర్ నుండి నాల్గవ అంతస్తు వరకు పరుగెత్తి చాలామంది ప్రాణాలను కాపాడి.. దట్టమైన పొగలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారని పలువురు నివాళులర్పించారు.
తాజా వార్తలు
- ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి కొత్త రూల్స్!
- ఏపీలో కొత్తగా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం..
- భారత్ ఘన విజయం
- అయోధ్య రామాలయం పనులు ముగింపు దశలో, ఏప్రిల్ 30కి ఏమిటి?
- 2026: అట్టహాసంగా ముగిసిన వింగ్స్ ఇండియా 2026
- అజ్మాన్ 'అబ్రా'కు పెరిగిన క్రేజ్
- రేపు సిట్ ముందుకు కేసీఆర్..
- యూఏఈ సరికొత్త చట్టం
- ఇజ్రాయెల్‌తో ట్రంప్ రాజీ..
- చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్







